ఓవర్ లోడ్తో వెళ్తున్న మూడు టిప్పర్లు సీజ్
శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర శనివారం వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు వాహనాలు తనిఖీ చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా డి. బి. ఎల్ సంస్థకు సంబంధించిన మూడు టిప్పర్లు మొరం ఓవర్ లోడుతో నడుపుతున్నట్టు గుర్తించారు. ఆ మూడు మట్టి టిప్పర్లను పట్టుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ వరిలో పెట్టినట్లు హుజురాబాద్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు తెలియజేశారు.
Recent Comments