పోలీస్ వాహనాల డ్రైవర్లు తమ వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పని సరిగా పాటించాలని
రిపబ్లిక్ హిందుస్థాన్,వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (ఎఆర్) వెంకటేశ్వర్లు అద్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయoలో జిల్లాలోని పోలీస్ స్టేషన్ల, సర్కిల్ కార్యాలయాల మరియు సబ్ డివిజన్ కార్యాలయాల పోలీస్ పెట్రోలింగ్ వాహనాల మరియు అధికారుల వాహనాల తనిఖీల్లో భాగంగా జిల్లాలోని పోలీసు వాహనాలను మరియు వాటి పనితీరు పరిస్థితులను (కండిషన్) లను మరియు ఒక రోజు శిక
్షణ, తనిఖీ నిర్వహించారు .
ఈ సంధర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్ లోని పెట్రోలింగ్ ఇన్నోవాలు, ఎస్.హెచ్.ఓ.ల వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ, వాహనాల పనితీరు పరిస్థితులను (కండిషన్) పరిశీలించి డ్రైవర్లకు సూచనలు చేశారు. ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించేలా పెట్రోలింగ్ వాహనాలు మంచి స్థితిలో (కండిషన్) లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్పుడే ఘటనా స్థలాలకు సకాలంలో చేరుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
డయల్ 100 ఫిర్యాదుల పరిష్కారం, విజిబుల్ పోలీసింగ్, మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలకు సకాలంలో చేరుకోవడంలో పెట్రోలింగ్ వాహనాలు కీలకంగా పని చేస్తాయని, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపినారు. ప్రతి పోలీస్ అధికారి తమ పరిధిలోని వాహనాలను స్వంత వాహనాల మాదిరిగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు సర్వీసింగ్ తో పాటు వాహనాలను నిత్యం శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారు ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ ను ధరించాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమములో ఎం.టి.ఓ వినోద్, మెకానిక్ కృష్ణ, సిబ్బంది రాజు మరియు డ్రైవర్లు వాహనాల పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments