బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, సూర్యాపేట : గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన కొండి నాగేష్ అనారోగ్యంతో గత వారం మరణించారు. నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఫోన్ ద్వారా ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘుకు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు రఘు చేతుల మీదుగా 5000 ఆర్థిక సహాయం 50 కేజీల బియ్యం ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి కుక్కల వెంకన్న,శివారెడ్డి, గరిడేపల్లి మండల సభ్యులు మన్నెం వేణు యాదవ్,ఫౌండేషన్ సభ్యులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments