◾️బేల్ట్ షాపులను నియంత్రించడంలో విఫలం
Thank you for reading this post, don't forget to subscribe!◾️ అధిక ధరలకు వైన్ షాప్ నుండి బెల్ట్ షాపులకు మద్యం విక్రయాలు
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ
రిపబ్లిక్ హిందుస్తాన్, నల్లబెల్లి: మండలంలో బెల్ట్ షాపులను నియంత్రించడంలో ఎక్సైజ్ శాఖ అధికారులు విఫలమయ్యారని, పలువురు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో మూడు వైన్ షాపులు ఉండగా 500 కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ధనార్ధనే ధ్యేయంగా వైన్ షాపులలో ఉన్న మద్యం బెల్టు షాపులకు అధిక రేట్లకు వైన్స్ యజమానులు సరఫరా చేసి అధిక మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా ఎక్సైజ్ శాఖ అధికారుల సన్నుల్లోనే జరుగుతున్న పట్టింపు లేకుండా వ్యవహరించడంలో ఆంతర్యం ఏంటా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైన్ షాపు యజమానులే బెల్ట్ షాపు నిర్వాహకులను ప్రోత్సహిస్తూ, వైన్స్ లో ఉండే అరుదైన బ్రాండ్లు మొత్తం ట్రాలీ, ప్యాసింజర్ ఆటోల ద్వారా గ్రామాలలో ఉండే బెల్టు షాపులలోకి సప్లై చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించి బెల్ట్ షాపులను అదుపు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Recent Comments