◾️గత నాలుగు నెలల నుండి నీళ్లు రాక ఇబ్బందులు…
◾️ జాతీయ రహదారిపై బైఠాయించిన తండావాసులు
◾️సర్పంచ్ భర్త , వైస్ ఎంపీపీ భర్తపై మండిపడ్డ తండావాసులు
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: తమ తండాకు గత నాలుగు నెలలుగా నీళ్లు రావడం లేదనీ 365 జాతీయ రహదారిపై పెద్ద తండావాసులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దతండకు చెందిన గ్రామస్తులు రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో అన్ని గ్రామాలకు నిరంధించినట్టే మా గ్రామానికి కూడా ఇస్తున్నప్పటికీ తమ తండాకు నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యం
ఎన్నిసార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంతోనే ధర్నాకు దిగమని తండావాసులు తెలిపారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తారని మండిపడ్డారు. నీళ్లు రాక హరిగోశలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
*చేతిపంపులకు మరమ్మతులు కరువు*
తండాలో ఆరు చేతిపంపులు ఉండగా నాలుగు సంవత్సరాల నుండి కనీసం ఒక్క చేతి పంపు రిపేర్ చేయలేదని, నీళ్ల కోసం మహిళలు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు మండిపడ్డారు.
*తమ ఓట్లు కావాలి… తమ అభివృద్ధి మీకు పట్టదా*
తమ ఓట్లు కావాలి తప్ప తన అభివృద్ధి వారికి పట్టదని సంఘటన స్థలానికి చేరుకున్న సర్పంచ్ భర్త మరియు వైస్ ఎంపీపీ భర్తను నిలదీశారు. సమస్యలు పరిష్కరిస్తామని, ధర్నా విరమించాలని కోరినప్పటికీ ఆగ్రహంతో గ్రామస్తులు పట్టించుకోలేదు. ధర్నా వద్దకు చేరుకున్న స్థానిక పోలీసులు వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింప చేశారు. తమ సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలని లేనియెడల తమ తండాకు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఓటుతోనే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments