జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా, జిల్లా ఎస్పి గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, వెంకట్ రావ్ పటేల్.
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ( Keslapur) నాగోబా జాతర ( Nagoba jathra) లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.








ఆదిలాబాద్ ( adilabad ) జిల్లా ఇంద్రవెల్లి (indravelly) మండలం కేస్లాపూర్ నాగోబా జాతర ఈ నెల 28 వ తేది నుండి ఫిబ్రవరి 4 వ తేది వరకు జాతర కొనసాగనున్న సందర్భంగా మొదటి రోజు మహపూజ తో ప్రారంభమై , రెండవ రోజు నుండి భక్తులు నాగోబా దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యం లో మూడవ రోజు ఆదివాసీ సంస్క్రుతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులచే నృత్య ప్రదర్శనలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
తెలంగాణలో జరిగే ఈ ఆదివాసీ సంబురం తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొంది, సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి ఈ వేడుకలను తిలకించారు
ఈ సందర్భంగా
మార్లవాయి జైనూర్ మండలం నుండి గుస్సాడి డ్యాన్స్,
కొలాం డ్యాన్స్ గుడిహాత్నూర్
గోండి దింసా కోహినూర్
ఆంధ్ కమ్యూనిటీ, ఇంద్రవెల్లి
పర్ధాన్ కమ్యూనిటీ డ్యాన్స్
తోటి, తోషం
నాయక్ పొడ్
పరార్ ఫౌండేషన్ హైదారాబాద్
నుండి వృక్ష సంపద పర్యావరణ పరిరక్షణ ల పై కళాకారులు ప్రదర్శన, నృత్యాలు చూపరులను విశేషంగా అలరించాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉదయం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభి గ్యాన్, ఆలయ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.
Recent Comments