— తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి జే. మైత్రేయి
— కోర్టు విధుల అధికారులు, అడిషనల్ పిపిలను అభినందించిన, రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి, మంచిర్యాల్ డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్..
రిపబ్లిక్ హిందుస్థాన్,ఉమ్మడి ఆదిలాబాద్:
బెల్లంపెల్లి ఏసీపీ పరిధిలోని సుబ్బారావు పల్లి శివారులో జరిగిన జంట హత్యలో పాల్గొన్న ఆరుగురు నేరస్తులకు ఒక్కొక్కరికి రూ. 13 వేల చొప్పున జరిమానా తో పాటు జీవిత ఖైదు శిక్ష ను విధిస్తూ గురువారం ఆదిలాబాద్ డిస్టిక్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి జి మైత్రియి సంచలన తీర్పు వెల్లడించారు.
🔴 కేసు పూర్వాపరాలు
2015 సంవత్సరంలో ఆగస్ట్ 2న బెల్లంపల్లి, సుబ్బారావు పల్లి శివారులో మంచిర్యాల జిల్లా కు చెందిన ఆరుగురు నేరస్తులు స్టోన్ క్వారీ భూమి కాజేయాలని కుట్రపన్ని యజమానులైన సిరికొండ సాంబయ్య, రాస గణపతి లను బర్షెలతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అడ్డువచ్చిన సిరికొండ రాకేష్, సిరికొండ సత్యనారాయణను తీవ్రంగా గాయపరిచారు, ఘటనా స్థలంలోనే సిరికొండ సాంబయ్య మృతి చెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గణపతి మృతి చెందాడు. ఈ క్రమంలో అదే రోజు గాయపడిన సిరికొండ రాకేష్ కాసి పెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి కాశీ పేట ఎస్ఐ శ్యామ్ సుందర్ హత్య నేరము నమోదు చేశారు. నేరము సంఖ్య 79/2015
సెక్షన్ 120 (బి) 148, 302.307. r/w 149 ఐపిసి, సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అప్పటి సిఐ పి. సదయ్య, ఏసిపిలు కే రమణారెడ్డి, సి సతీష్ లు దర్యాప్తు చేపట్టారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించి ఘటనా స్థలంలో సాంకేతిక సాక్ష్యంతో పాటు ప్రత్యేక సాక్షులను విచారించారు. గాయపడిన వారిని విచారించి స్టోన్ క్వారీ భూమి వివాదంపై కుట్ర పన్ని ఇరువురిని హత్యచేసిన ఆరుగురు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.నిందితులు
1) శివరాత్రి ప్రసాద్, 2) శివరాత్రి నారాయణ,3) కస్తూరి రవీందర్, 4) కల్లూరి సుధాకర్, 5) శివరాత్రి కృష్ణ, 6) శివరాత్రి శంకర్.
🔴 తీర్పు
హత్య నేరంపై ఆరుగురు నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రత్యేక సాక్షులతో తుది నివేదిక చార్జిషీట్ న్యాయస్థానంలో దాఖలు చేయగా. ఆరుగురు నేరస్తులపై అదిలాబాద్ న్యాయస్థానంలో సాక్షుల విచారణ కొనసాగుతున్నది. న్యాయస్థానంలో సాక్షుల పర్యవేక్షణ చేపడుతున్న బెల్లంపల్లి ఏసిపి ఏ. మహేష్, మందమర్రి సిఐ పి
ప్రమోద్ రావు, కాజీపేట ఎస్ఐ కె. నరేష్, ప్రాసిక్యూషన్ విభాగం నుండి అదనపు పీపీలు ఈ కిరణ్ కుమార్ రెడ్డి, ముస్కు రమణారెడ్డి, మేకల మధుకర్, కోర్టు వ్యవహారాల ఇన్చార్జి అధికారులు సయ్యద్ తాజుద్దీన్, ఎండి జహీరుద్దీన్, జి రాఘవేంద్ర రావు సహకారంతో 41 మంది సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా నేరస్తులపై అభియోగం రుజువు చేయడంతో గురువారం నిందితులకు యావజ్జీవ ఖైదు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న రామగుండం కమిషనరేట్ సిపి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం కమిషనరేట్ డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్,
ప్రాసిక్యూషన్ విభాగం, కోర్టు వ్యవహారాల ఇన్చార్జి అధికారులను అభినందించారు. కఠినమైన తీర్పులతోనే నేరస్థులు నేరం చేయడానికి వెనుకంజ వేస్తారని, అత్యంత పటిష్టంగా ప్రాసిక్యూషన్ విభాగంతో పాటు పోలీస్ దర్యాప్తు విభాగం సంయుక్తంగా విచారణ చేపట్టి నేరాన్ని రుజువు చేసినట్లు పేర్కొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments