ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన రేపిస్టులకు సంఖ్య తగ్గడం లేదు.. అయితే తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. వితంతువులు , అనాథలను , వికలాంగులను, ఒంటరి మహిళలు , పసిపాపల మొదలు పండు ముసలి వరకు కూడా కామాంధులు వదలడం లేదు. అయితే కొన్ని ఘటనలు బయటికి వస్తె మరికొన్ని బయటికి రావడం లేదు. తాజాగా ములుగు జిల్లాలో జరిగిన ఘటనలు జనం రోడ్డు పై రావడం చూస్తుంటే పరిస్థితి ఏమిటో అద్దం పడుతుంది.
ములుగు : తెలంగాణలోని ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెంకటాపూర్ మండలం పెరుకపల్లి గ్రామంలో వితంతు మహిళపై శివకుమార్ అనే వ్యక్తి శనివారం రోజున అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అదే రోజున స్థానిక పోలీసు స్టేషన్‌లో బాధితురాలి తరపు బంధువుల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి రెండ్రోజులు అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం బాధితురాలి బంధువులు ధర్నాకు దిగారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేస్తామని డీఎస్పీ రవీందర్ తెలిపారు.
Recent Comments