ఆదివాసి సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయిసిడం జంగు పటేల్
రిపబ్లిక్ హిందూస్తాన్,
గుడిహత్నుర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పెందోర్ పుష్ప రాణికి ఆదిలాబాద్ సేన సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆదివాసి సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయిసిడం జంగు పటేల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆదివాసి లకు ఎమ్మెల్సీ, రాజ్యసభ సీటును ఎ రాజకీయ పార్టీ కేటాయించలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి సేన అభిమాన ఎంపిటిసిలు, జడ్పీటీసీ లు, మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు ప్రతి పక్ష పార్టీలు ఆదివాసి సమాజం తరుపున పేందూర్ పుష్పరాణికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయిసిడం జంగు పటేల్, ఆదివాసి సేన గుడిహత్నుర్ మండల ఉపాధ్యక్షులు సలాం జాకు,జిల్లా కమిటీ సభ్యులు కుంరం విష్ణు, గోండ్వానా రాయి సెంటర్ సభ్యులు దుర్వ జగ్గారావు, ఆదివాసి సేన సభ్యులు రాయిసిడం బాలాజీ, యశ్వంత్, మేస్రం ధర్ము, సుధాకర్,గంగారాం, రాంజీ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments