రిపబ్లిక్ హిందుస్థాన్ , కుంరం భీం ఆసిఫాబాద్ :
కుంరంభీము ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసిన అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కుంరంభీము జిల్లా జడ్పి చైర్మన్ కోవ.లక్ష్మీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ , అసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు ఎమ్మెల్యే కోనేరు కొనప్ప .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామగ్రామనా గ్రామ పంచాయతీ భవనాలు ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది.అని వారు తెలిపారు. అసిఫాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పల్లెలన్నీ క్రమక్రమంగా ప్రగతిపథంలో పయనిస్తున్నాయని అన్నారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.
గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు.ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వీలుగా చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను మంజూరు చేయడంతో పాటు డంపింగ్ యార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. గ్రామస్తులకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన జలాలను సరఫరా చేస్తున్నదన్నారు.ప్రతీ గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో పల్లెప్రకృతి వనాలు,అంతిమ సంస్కారాల కోసం వైకుంఠ ధామాలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు.ప్రతీ నెలపల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యకలాపాల పనితీరు మెరుగు, పర్యవేక్షణ కోసం పంచాయతీ రాజ్ శాఖ రెండు యాప్ లను అమల్లోకి తెచ్చిందని అన్నారు. గ్రామాలవారీగా నాలుగేండ్ల అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం ప్రతీ ఏటా రూ.9,916 కోట్ల నిధులు సమకూరుతున్నాయని చెప్పారు.తెలంగాణ రాష్ట్రం 70ఏండ్లలో సాధించాల్సిన అభివృద్ధిని కేవలం ఏడేండ్లలో సాధించిందని కితాబిచ్చారు.సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
స్వరాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పకడ్బందీగా అమలవుతున్నాయని అన్నారు.ప్రపంచ దేశాలను కరోనా కబళించినప్పటికీ స్వరాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం నిధుల కొరతతో నిలిచిపోలేదని అన్నారు.పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో పండుగగా కొనసాగుతోందన్నారు. జాతిపిత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కేసీఆర్ సర్కార్ సాకారం చేస్తున్నదని అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి సరిపడ నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడూ విడుదల చేస్తున్నదని అన్నారు.
కరోనా లాంటి సంక్షోభంలోనూ ప్రభుత్వం రైతులు పండించే పంటలకు పెట్టుబడి సాయంగా రైతుబంధు విడుదల చేసిందన్నారు.రైతు మృతిచెందితే అతడి కుటుంబం రోడ్డునపడే దుస్థితి నెలకొనవద్దనే ఉద్దేశంతో రైతుబీమా పథకం ద్వారా నామినీకి రూ.5లక్షల చెక్కును ప్రభుత్వం అందజేస్తోందన్నారు.
వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మక మార్పుల కారణంగా రైతులు సగర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మండల జెడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు గారు , ఎంపిపి అరిగెల మల్లికార్జున్ గారు,సింగిల్ విండో చైర్మన్ అలీ గారు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేష్ గారు, కాంట్రాక్టర్ అబ్దుల్లా గారు, నాయకులు రవీందర్, సలాం,జీవన్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments