రిపబ్లిక్ హిందూస్థాన్,ఆసిఫాబాద్: ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరయ్యే ఆర్థికసహాయం లబ్దిదారులకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.చెక్కులు పొందిన వారి వివరాలు…. రెబ్బెన మండలం లోని తుంగెడ గ్రామానికి చెందిన దేవాజి కు రూ.60,000 వేలు, ఆసిఫాబాద్ మండలం లోని జాన్కపూర్ కు చెందిన అస్మా కు రూ.60,000 వేలు, ఆసిఫాబాద్ మండలం లోని రాలవడా కు చెందిన నాందేవ్ కు రూ.60,000వేలు, రెబ్బెన మండలం కి చెందిన పాండు కు రూ.60,000 వేలు, ఆసిఫాబాద్ మండలం లోని ఎల్లారం గ్రామానికి చెందిన రోజారాణి కు రూ.22,000 వేలు, ఆసిఫాబాద్ మండలం లోని రాజాంపేట్ కు చెందిన శ్రీధర్ కు రూ.60,000 వేలు, కెరమెరి మండలం కు చెందిన విజయ్ కుమార్ కు రూ.60,000 వేలు, ఆసిఫాబాద్ మండలం లోని బురుగుడా గ్రామానికి చెందిన దేవక్క కు రూ.31,500 వేలు, రెబ్బెన మండలం లోని తుంగెడ గ్రామానికి చెందిన బుచ్చయ్య కు రూ.17,500 వేలు, రెబ్బెన మండలం లోని కొండపల్లి గ్రామానికి చెందిన నాందేవ్ కు రూ.12,000 వేలు, రెబ్బెన మండలం కు చెందిన గౌస్య ఫాతిమా కు రూ.25,500 వేల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, సర్పంచ్ చిరంజీవి,రాయ్ సెంటర్ సర్ మేడి కుంరం దొందేరావు, ఆత్రం సక్కు యూత్ ఫోర్స్ అధ్యక్షుడు ఆత్రం వినోద్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments