రిపబ్లిక్ హిందూస్థాన్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు మంత్రి హారిష్ రావ్ సూచించారు.
సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామ రెడ్డితో కలిసి అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు .
జిల్లాలో మొత్తం 48 చోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లపై వరద నీరు ప్రవహించింది. దెబ్బతిన్న చోట మరమ్మతులు వెంటనే చేపట్టాలి. క్రాష్ ఓవర్ ఫ్లో, రీ టైనింగ్ వాల్ క్రాష్ అయిన చోట్ల వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి.
వర్షాల జిల్లాలో ఎక్కడా విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలి. దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ లు, విద్యుత్ పోల్ లను గుర్తించి వెంటనే అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలి. సిద్దిపేట లో నిరంతరం విద్యుత్ ఉన్నట్టే మద్దూరు, ధూల్ మిట్ట మండలంలో కరెంట్ సరఫరా ఉండేలా సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటి వరకూ జిల్లాలో కురిసిన వర్షాలకు మొత్తం 3516 చెరువులకు గానూ 1250 చెరువులు సర్ ప్లస్ అయ్యాయి. 895 చెరువులు పూర్తిగా నిండాయి. సర్ ప్లస్, నిండిన చెరువులు వర్షాలకు బ్రీచ్ కాకుండా కట్టలను బలోపేతం చేయాలి. వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు సంబంధించి బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేయాలి.
మృత్యు వాత పడిన పాడి, పశువులు, కోళ్లకు సంబంధించి కూడ చెక్కులను రెండు రోజుల్లోగా అందించాలనీ అధికారులకు ఆదేశాలు. వచ్చే డిసెంబరు లోగా జిల్లాలో 3 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే లక్ష్యంను పూర్తి చేయాలనీ ఉద్యాన వన అధికారులకు సూచన. మల్బరీ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి, మల్బరీ తోటల సాగు విస్తీర్ణం పెరిగేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
జిల్లాలోని పురపాలికల పరిధిలో భవన నిర్మాణ అనుమతుల్లో తీవ్ర జాప్యం చేసుకుంటున్నట్లు భవన నిర్మాణ దారుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ ముజ మిల్ ఖాన్ ప్రత్యేక దృష్టి సారించి దరఖాస్తులు త్వరితగతిన పరిశీలించి నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. చేర్యాల, హుస్నాబాద్‌లో సమీకృత కార్యాలయాల భవనాలు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలి. జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి ఏ ఒక్క పేమెంట్ పెండింగ్ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్య ప్రణాళిక అధికారిదేనని అన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments