రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని సాంగిడి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని , అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సాంగిడి గ్రామస్తులు డిఆర్డిఎ పిడి కిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలంలోనీ సాంగిడి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి అన్నారు. పనులు పనిచేయకుండా ఉపాధి హామీ పథకంలో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసి వేల రూపాయలు అవినీతికి పాల్పడటం తోపాటు అసలు పనికి రాని వారికి జాబ్ కార్డు సృష్టించి డబ్బులు కాజేసిన ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా పని చేసిన వారికి తక్కువ డబ్బులు అసలు పనికి రాని వారికి డబ్బులు చెల్లిస్తూ గ్రామంలో ఉపాధి హామీ లో అవినీతికి పాల్పడటం బాధాకరమన్నారు. జిల్లాలోని ఎక్కడ జరగనటువంటి అవినీతి సాంగిడి గ్రామంలో జరిగినట్లు ప్రస్తుతం గ్రామంలో ఉపాధి హామీ పనులపై కొనసాగుతున్న ఆడిట్ అధికారుల ద్వారా బట్టబయలైందన్నారు.

ఇప్పటికైనా జిల్లా అధికారులు చూసీచూడనట్లు వదిలేయకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొవలని అన్నారు. ఉపాధి హామీ లో కష్టపడి పనిచేస్తున్న వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇప్పటికే పలుమార్లు జిల్లా అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఉన్నత అధికారులు సైతం ముడుపులు తీసుకుంటున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. అందుకు అవినీతికి పాల్పడిన వారి పైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. చర్యలు తీసుకోలేనిపక్షంలో తీవ్రస్థాయిలో ఆందోళనకు వెనుకాడమని అన్నారు. ముఖ్యంగా ఈ అవినీతికి కారకులైన మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆయనకు సహకరిస్తున్న పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్ ని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాల్లో పాల్గొన్న వారి పేర్లు పసల ఆశన్న, గేడం సదాశివ్, సునీల్,నర్సింగ్,గంగన్న,రవీందర్,పోచ్చన్న,ముత్తన్న, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments