హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం భద్రత అధికారులు బుధవారం రూ.14కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ రిజ్వీ గా భద్రత అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ.14 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్, గంజాయి రవాణా కట్టడికి ప్రయత్నిస్తున్నప్ప టికి రాష్ట్రంలో తరుచు గంజాయి, డగ్ర్స్ దందాలు వెలుగుచూస్తున్న తీరు సమస్య తీవ్రతను చాటుతుందంటున్నారు
నిపుణులు. ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ లో రూ.12వేల కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం చూస్తే రాష్ట్రంలో మరింత భద్రత పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో 14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత.!
RELATED ARTICLES
Recent Comments