నిర్మల్ జిల్లా: జనవరి 12
తెలంగాణ RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటంతో రద్దీ బాగా పెరిగింది. అసలే పండగ సీజన్.. సంక్రాంతి పండగన నేపథ్యంలో ప్రజలు తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు.
ఈ క్రమంలోనే పలుచోట్ల ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు సిగపట్లకు దిగుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులో మహిళలు గొడవపడ్డారు. ముధోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ లో భైంసా నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో మహిళలు సీట్ల కోసం సిగలు పట్టుకుని తీవ్రంగా కొట్టుకున్నారు.
Free seat సీటు కోసం జుట్టుతోపాటు జాకెట్ పట్టుకొని ఆడవాళ్లు దారుణంగా కొట్లాడుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి
నిజామాబాద్ Nizamabad నుంచి భైంసా Bhainsa వస్తున్న ఆర్టీసీ బస్సు గురువారం సాయంత్రం ముథోల్ కు చేరుకుంది. కొన్ని సీట్లు ( mahalaxmi free bus travel) ఖాళీ కాగా అప్పటికే రెండు బస్సులు చెడిపోవడంతో అందులోని ప్రయాణికులు ఈ బస్సులోకి ఎక్కారు.
ముథోల్లో ఎక్కిన కొందరు మహిళలు ( womens ) సీటు ఆపగా అప్పటికే బస్సులోని మహిళలకు..వీరికి ఆ సీటు కోసం కొట్లాట జరిగింది. కండక్టర్ చెబుతున్నప్పటికీ మహిళలు వినిపించు కోలేదు.బస్సులో ఉన్న మరికొందరు ప్రయాణికులు ఇదంతా వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
Viral videos: బస్సులో సీటు కోసం జుట్టు ఊడిపోయేలా మళ్లీ కొట్టుకున్న మహాలక్ష్మి ప్రయనికురాల్లు…
Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES


Recent Comments