Saturday, August 30, 2025

శివనామ స్మరణతో మార్మోగిన పుర శైవ క్షేత్రాలు

రిపబ్లిక్ హిందుస్థాన్, రామకృష్ణాపూర్ (ఫిబ్రవరి 18):  రామకృష్ణాపూర్ లోని స్థానిక కోదండ రామాలయం ప్రాంగణంలో ఉన్న శివాలయం, అంగడి బజార్ ఏరియాలోని నూతన రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకొని తెల్లవారుజామున బిల్వార్చన,రుద్రాభిషేకాలు వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఘనంగా నిర్వహించారు.శివపార్వతల కళ్యాణాన్ని ఆలయ అర్చకులు అంబా ప్రసాద్,దేవోజు రాజశేఖర నంద స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా,భక్తులు కనుల పండుగగా తిలకించారు.బూర్ల పవన్ కుమార్ (శ్రీ రాగ మయూరి) భజన మండలిచే భక్తి పాటలు ఆలపించగా శివనామస్మరణతో ఆద్యంతం భక్తులు జాగారణ చేశారు.ఈ కార్యక్రమంలో రామాలయం ప్రచార కార్యదర్శి దండు సదానందం,ఆలయ అర్చకులు చక్రవర్తి శర్మ,సూరజ్, కమిటీ సభ్యులు చిలుముల కొమరయ్య, కొట్టి నరేష్,రాజరాజేశ్వర స్వామి నూతన ఆలయ కమిటీ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, కమిటీ సభ్యులు నందిపేట సదానందం,సుంకరి రాజేశం,రాంపెల్లి రమణ,రావుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!

శివరాత్రి సందర్భంగా పులిహోర,మజ్జిగ పంపిణి

రిపబ్లిక్ హిందుస్థాన్, రామకృష్ణాపూర్ (ఫిబ్రవరి 18):

జిఎస్ఆర్ ఫౌండేషన్, ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ బాబు,పరికిపండ్ల నరహరి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిరాన్ని పురస్కరించుకొని చెన్నూరు నియోజవర్గంలో జైపూర్ మండలం వేలాల మల్లికార్జున స్వామి,కత్తెర శాల మల్లన్న ఆలయాలలో భక్తులకు పులిహోర,మజ్జిగ పాకెట్స్ ,వాటర్ ప్యాకెట్లను శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని మంచిర్యాల్ డిసిపి కెకన్ సుధీర్ రామనాథ,జైపూర్ ఎసిపి గోపతి నరేందర్,శ్రీరాంపూర్ సిఐ రాజు,జైపూర్ ఎస్సై రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ రమేష్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జిఎస్ఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పరికిపండ్ల నరహరి అభినందించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలను ఆలయ ఫౌండేషన్ తో కలిసి కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బద్రి సతీష్,కిరణ్ కుమార్,ఉప్పలపు సురేష్,అజయ్,డిజే సతీష్,కాంగ్రెస్ సేవాదళ్ ఎండీ పాషా భీమరం మండల సభ్యులు అయిలి నరేందర్, లాజర్ దుర్గం,పూసల రమేష్, నరేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వల్ అడవి ప్రాంతంలో స్వయంభు గా వెలిసిన శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.అనంతరం రుద్రహోమం,లక్ష బిల్వార్చన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కలువ రవి,జన్నారం మండల ఎంపిపి మదాడి సరోజన రవీందర్ రావు,కవ్వాల సర్పంచ్ లక్ష్మి పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి