▪️స్నేహితురాలే కత్తి తో పొడిచి చంపినట్లు నిర్ధారణ ▪️ యువతి హత్య కేసును చేదించిన పోలీసులు
రామకృష్ణాపూర్ మార్చ్ 21 (రిపబ్లిక్ హిందుస్థాన్) : రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్చి 15 రాత్రి సమయంలో గుడిపల్లి వెళ్లే దారిలో సల్లూరి అంజలి (వయసు 21)అనే యువతిని ఆమె స్నేహితురాలు పెరుగు మహేశ్వరి ( వయసు 27) అనే మహిళ హత్య చేయడం జరిగిందన్నారు.మహేశ్వరి గాయం చేసుకుని అంజలి హత్య చేయడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు.హత్య అనంతరం ఆమె స్నేహితుడు శ్రీనివాస్ కి ఫోన్ చేసి తామిద్దరం గొడవ పెట్టుకున్నామని ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళ్లమని చెప్పిందన్నారు.శ్రీనివాస్ వచ్చి వెంటనే అంజలి, మహేశ్వరిని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వెళ్లాడని అన్నారు.హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్లు పరిశీలించి అంజలిని బ్రాడ్ డెడ్ గా డిక్లేర్ చేశారని తెలిపారు.ఈ హత్యకు సంబంధించి అంజలి మహేశ్వరిని హత్య చేయడానికి కారణాలు తెలుసుకోగా మహేశ్వరి అంజలిని ప్రేమించిందని,ఈ విషయం ఇంట్లో ఒప్పుకోరని, మన మధ్య ఇలాంటిది కుదరదని అంజలి మహేశ్వరికి చెప్పింది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న మహేశ్వరి ఒక పథకం ప్రకారం మార్చి 15 రాత్రి 10 గంటలకు అంజలిని నమ్మించి మోటార్ సైకిల్ పై తీసుకొని అంజలి స్వగ్రామం మామిడిగట్టు వైపు వెళ్దాం మనం మాట్లాడుకుందామని తీసుకువచ్చి గుడిపల్లి వెళ్లే దారిలో వెంట తీసుకొని వచ్చిన కూరగాయలు తరిగే కత్తితో అంజలి మెడపై పొట్టపై బలమైన గాయాలు చేసి అంజలి ని చంపడం జరిగిందని తెలిపారు. మహేశ్వరి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ బి అశోక్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments