Thursday, November 21, 2024

లక్కీడ్రా స్కీమ్ బాధితులకు న్యాయం జరిగేనా….!?



కేసులతో సరిపెట్టేశారు…. బాధితులకు న్యాయం????

అప్పట్లో సంచలనంగా మారిన లక్కీడ్రా స్కీమ్… బాధితులకు న్యాయం కోసం ‘రిపబ్లిక్ హిందుస్థాన్’ పోరాటం

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సామాన్య ప్రజల ఆశలను వ్యాపార పెట్టుబడిగా చేసి కొంతమంది లక్కీ డ్రా పేరిట స్కీమ్ మొదలు పెట్టి వారిని నిండా ముంచేసిన ఘటన అప్పట్లో ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం రేకెత్తించిన విషయం తెల్సిందే.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం తో పాటు బోథ్ నియోజకవర్గం మండలాల్లో జరిగిన ఈ దోపిడీ పై మీ రిపబ్లిక్ హిందుస్థాన్ ప్రత్యేక కథనం….

భారీ గా ప్రైజెస్ తో నిర్వాహకులు సభ్యులను బోల్తా కొట్టించిన బ్రౌచర్లు ఇవే…



జిల్లాలో మొదట్లో కారు, బైకలు, ట్రాక్టర్లు, జేసిబి లు వంటి పెద్ద పెద్ద వాహనాలతో పాటు రిఫ్రీజీరేటర్లు, టీవీలు వంటి వస్తువులు ఎంటర్ ప్రైజెస్ పేరిట లక్కీడ్రా స్కీమ్ లను కొంతమంది రిపోర్టర్లు మరియు రాజకీయ పలుకుబడి ఉన్న వారు ప్రారంభించారు. ఒక్కో సభ్యుడి వద్ద నుండి రూ. 1200 వందల నుండి రూ.1500 వరకు నెలనెల వసూలు చేసుకున్నారు. 12 నెలలు పూర్తయితే ఖచ్చితంగా పెద్ద బహుమతి అని ఆశ పెట్టారు. అయితే వీటి పై లక్కీ డ్రా లో సభ్యత్వం తీసుకునే సభ్యులకు నమ్మకం కలిగేలా ప్రతినెలా ఒకరికి ఒక బైక్ లేదా కారును ఓ రెండు నెలల పాటు ఇచ్చారు. ఇలా చేయడం తో ప్రజల్లో ఈ ఎంటర్ ప్రైజెస్ ల పై విపరీతంగా క్రేజీ పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా తో పాటు, మహారాష్ట్ర సరిహద్దు ప్రజలు కూడా వీటి వైపుకు ఆకార్షితులయ్యారు. ఇంకేం… నిర్వాహకాల పంట పండింది. వందల సంఖ్యలో ఎంటర్ ప్రైజెస్ మొదలు పెట్టారు. కొన్ని కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును స్వాహ చేసుకున్నారూ.
అయితే లక్కీ డ్రా లో తమ పేరు డ్రా అయినా బహుమతి ఇవ్వకపోవడం తో అనుమానం వచ్చిన సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో నిర్వాహకుల పై కేసులు సైతం నమోదు అయ్యాయి.

లక్కీ డ్రా నిర్వాహకులు ఇచ్చిన సభ్యత్వ కార్డులు


బోథ్ లో కేసులు నమోదు కావడం తో నిర్వాహకులు గా ఉన్న పత్రిక రిపోర్టర్లు లక్కీడ్రా ఇవేంట్ ను నిర్మల్ జిల్లా లోని మహబూబ్ గాట్ కీ తమ మకాం మార్చుకుని డ్రా కోసం రెడీ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ కీ విషయం తెలవడంతో, నిర్మల్ జిల్లా సారంగాపూర్ పోలీసులు డ్రా స్థావరం పై దాడి చేసి, డ్రా నిర్వహిస్తున్న వారిని అదుపులో తీసుకుని, లక్కీ డ్రా కోసం వినియోగించే వస్తువులు నగదు సిజ్ చేశారు. అయితే ఇందులో విస్తూ గోలిపే విషయం ఏమిటంటే పట్టుబడిన నిందితుల్లో కొన్ని ప్రముఖ పత్రిక విలేకర్లు కూడా ఉండడం. నిర్వాహకులు జర్నలిస్టులు ఉన్నప్పడు, ఇద్దరు ముగ్గురు జర్నలిస్టుల పై కేసులు నమోదు అయి, స్పాట్ లో దొరికిన ‘సీనియర్ ‘ పై ఎందుకు కేసు నమోదు కాలేదన్నది ఇప్పటికి అర్థం కానీ ప్రశ్న…?

బాధితుల నుండి నెల నెల వసూలు చేసుకున్న రిసిప్ట్ లు

( స్పాట్ లో దొరికినప్పడు పోలీసు సిబ్బంది తీసిన వీడియోలు త్వరలో మీ రిపబ్లిక్ హిందుస్థాన్ న్యూస్ ఛానెల్ లో చూడగలరు )వీడియో చుసిన అనంతరం ఒక నిర్ణయానికి రాగలరు. ఒకే ప్రాంతం రిపోర్టర్లు, అయితే… కొందరి పై కేసు…. మిగతా వారి పై!??



పట్టుబడిన లక్కీ డ్రా నిర్వాహకులలో ప్రధాన సూత్రదారి….!?
షేకసాబ్ లొద్ది మహబూబ్ గాట్ లో నిర్వహిస్తూ పట్టుబడిన వారిలో లక్కీ డ్రా ప్రధాన సూత్రదారి పోలీసులకు చిక్కినట్లే చిక్కి చాకచక్యంగా తప్పించుకున్నాడు. అప్పట్లో అదే సమయంలో అతను కేసు నుండి తప్పించుకోవడానికి ఇచ్చోడా లో పని చేసి, నిర్మల్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయినా ఓ అధికారి ఆ ప్రధాన సూత్రాధారికి కేసు నుండి బయట పడేలా చేసినట్లు సమాచారం. అధికారులు దీని పై దృష్టి సారిస్తే అసలు నిజం బయటకొచ్చే ఆస్కారం ఉంది.
అధికారులు ఈ కేసును తిరిగి ఓపెన్ చేస్తే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి