జ్యూస్ స్టాల్ నిర్వాహకులు అమీర్, కైఫ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
జ్యూస్ స్టాల్ నుండి సుమారు ఒక లీటర్ మూత్రం స్వాధీనం చేసుకున్నారు
బయట తిండి తినాలంటే భయపడే రోజులు కనిపిస్తున్నాయి. కొందరు తమ చిలిపి చేష్టలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వరంగల్ లో ఓ వ్యక్తి వీర్యం కలుపుతూ అమ్ముతున్న ఘటన మరువక ముందే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జ్యూస్ లో మూత్రం కలుపుతూ అమ్ముతున్న ఘటన ఒకటి ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇలా చేసి అమ్మేవారికి ఏదైనా నయం కానీ జబ్బు , రోగాలు ఉంటే కొని తిన్న, తాగిన వారి పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఇవి కెమెరా లేదా మనుషులు కంట పడితే మాత్రమే బయట పడుతున్నాయి. ఇలాంటి ఘటనలతో బయట పుడ్ తినలంటేనే జనం జంకుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్: ఘజియాబాద్‌లోని ఓ జ్యూస్ స్టాల్ యజమాని యూరిన్‌లో జ్యూస్ కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని, అతనితో పాటు పనిచేస్తున్న మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోలీసులు జ్యూస్ స్టాల్‌లో మూత్రం నింపిన బాటిల్‌ను కూడా గుర్తించారు. ప్రజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఈ ఘటన లోని బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరాపురి కాలనీలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం ఖుషీ జ్యూస్ కార్నర్ అనే దుకాణంలో పనిచేస్తున్న యువకుడు బాటిల్‌లో మూత్రం తీసుకువస్తుండగా కొందరు వ్యక్తులు చూశారు. దీని తర్వాత, ప్రజలు శబ్దం సృష్టించి, రసంలో మూత్రం కలిపి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు దుకాణదారుని కూడా చితక బాదారు. ఈ విషయాన్ని ఎవరో పోలీసులకు సమాచారం అందించారు.
ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….
ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జ్యూస్ స్టాల్‌లో సోదాలు చేసినట్లు అంకుర్ విహార్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ భాస్కర్ వర్మ తెలిపారు. సోదాలు చేయగా జ్యూస్ స్టాల్ వద్ద మూత్రం నింపిన ప్లాస్టిక్ బాటిల్ కనిపించింది. నిందితుడు జ్యూస్ విక్రేతను ప్రశ్నించగా, అతను ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయాడు, ఆ తర్వాత అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు తదుపరి విచారణలో నిమగ్నమై ఉన్నారు.
https://x.com/greenteamIndia/status/1834622580029821176?t=RVV7x1TDfYu8eeraBGVISg&s=19
Recent Comments