3నెలల జైలు శిక్ష తో పాటు రూ.2000 జరిమానా విధించిన కోర్టు….
ఇచ్చోడ : మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి నేరం రుజువు కావడం తో శనివారం రొజు కోర్టు శిక్షను ఖరారు చేసింది.
ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన ముస్లె రవి అనే వ్యక్తి 2017 సంవత్సరంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించ్చాడు. నిందితుడి పై ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కోర్టు లో విచారణ కొనసాగిన నేపథ్యం లో ముస్లె రవి నేరస్థుడని రుజువు అయింది.
తాజాగా ఆ కేసులో తేది 08.04.2022 న బోథ్ జుడిసియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ హుస్సేన్ భుకియా నిందితుడు ముస్లె రవి కి 3 నేలల జైలు శిక్ష మరియు 2000 జరిమాన విధించారు. కోర్టు విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీధర్ 6 గురు సాక్ష్యులను ప్రవేశ పెట్టి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. ఇచ్చోడ ఎస్సై పి ఉదయ కుమార్ , కోర్ట్ పిసి పురుషోత్తంలు సాక్షులను సమయనుశారం కోర్ట్ లో హాజరు పరిచి నిందితునికి శిక్ష పడేలా కృషి చేశారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments