సర్పవరంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ‘జనాన్ని జగన్ నమ్మడు.. జగనన్నని మీరు నమ్మండి’ అని ముద్రించారిలా..
కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలో వైకాపా నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ సీఎం జగన్‌ను అభాసుపాలు చేసింది.
‘సిద్ధం’ పేరుతో ఉన్న ఈ ఫ్లెక్సీలో ‘కాకినాడ రూరల్ ప్రజలారా.. జనాన్ని జగన్ నమ్మడు.. జగనన్నని మీరు నమ్మండి.. మీ ఓటు ద్వారా జగనన్నను దీవిస్తారని ఆశిస్తున్నాం’ అంటూ పేర్కొన్నారు. ఈ దోషాన్ని గమనించి కొందరు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అప్రమత్తమైన స్థానిక నాయకులు ‘నమ్మడు’ అనే పదాన్ని ‘నమ్మాడు’ అని దిద్దారు. తర్వాత ఆ పదంపై కాగితం అంటించారు. దానినీ కొందరు తొలగించడంతో గత్యంతరం లేక ఏకంగా ఫ్లెక్సీనే తీసేశారు. సీఎం జగన్, వైకాపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్..ఎమ్మెల్యేలు ద్వారంపూడి, కన్నబాబు చిత్రాలతో ఉన్న ఈ ఫ్లెక్సీని స్థానిక వైకాపా నాయకుడు పుల్ల కోటేశ్వరరావు ఏర్పాటుచేశారు.

తప్పు గమనించిన అనంతరం ఇలా కాగితం అంటించి.. ఆ తర్వాత తొలగించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments