చట్టం ప్రకారం ఏ శిక్షకైనా సిద్ధం * మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్ * కాంగ్రెస్ పార్టీలో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది * రేపో మాపో పార్టీ మారడం ఖాయం*
రిపబ్లిక్ హిందుస్థాన్, నిర్మల్ (వెబ్ డెస్క్) :
మున్సిపల్ ఉద్యోగాల నియమాకాల్లో తనపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. నిరాధార ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలుంటే బయటపెట్టాలని సవాలు విసిరారు. అసత్య ప్రచారం చేస్తున్నందుకు పోలీసులు మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. పోలీసులు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారని, ఆరోపణలకు రుజువులు చూపాలన్నారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం ఎలాంటి శిక్షకైనా తను సిద్దమని మంత్రి అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో మహేశ్వర్ రెడ్డి పనైపోయిందని, రేపో మాపో ఆయన పార్టీ మారుడు ఖాయమన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తే స్పందించని మహేశ్వర్ రెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు …. మహేశ్వర్ రెడ్డిపై పోలీసుల కేసు నమోదు చేస్తే మాత్రం… ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తే…. మొదటి స్పందించింది బీఆర్ఎస్ పార్టీయేనని, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిస్సహాయ స్థితిలో ఉందని వ్యాఖ్యనించారు.


Recent Comments