Tuesday, July 1, 2025

Indiramma Houses scheme: ఈ ఉగాదికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు..!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలోని తెలంగాణ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముందుకు సాగుతోంది.

ఈ ఏడాది పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని కొత్త ఒరవడితో పునరుద్ధరించింది సర్కార్. ప్రజాపాలనాలో పేదలకు ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు.

ఈ స్కీమును ప్రతిష్టాత్మకం గా తీసుకున్న ప్రభుత్వం ఉగాది పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. దీనికోసం కార్యాచరణ సిద్ధం చేసి బడ్జెట్ లో భారీ నిధులను కేటాయించింది.

అందువల్ల ఈ స్కీము విషయంలో ప్రభుత్వం చాలా నిబద్ధతో ఉందనే సంకేతాలను ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్స రానికి రూ. 12,571 కోట్లు కేటాయించడతో ఈ స్కీము వేగం పుంజుకుంది.

గత బడ్జెట్ లో రూ. 3,184 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం, ఈ సారి రూ. 3,387కోట్లు అదనంగా కేటాయించి లబ్దిదారుల్లో ఉత్సాహాన్ని నింపింది. అందువల్ల ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శల కు చెప్ పెట్టినట్లవుతోందని విశ్లేషకులు అంచనా వస్తున్నారు.

కేంద్రం సహకారం లేకపోయి నా వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల కోడ్ అడ్డంకి తొలగడంతో ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటుంది.

ఇప్పటికే 72వేల మంది లబ్దిదారులను ఎంపిక చేసి కొందరికి జనవరి 26న మంజూరు పత్రాలను అందజేశారు. మిగతావారికి త్వరలోనే ఇవ్వనున్నారు


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి