Wednesday, October 15, 2025

జిద్దాలో సంక్రాంతి సంబరాల సందడి – (2024)

జిద్దాలో సంక్రాంతి సంబరాల సందడి(2024):

రిపబ్లిక్ హిందుస్థాన్, గల్ఫ్ ప్రతినిధి :

Thank you for reading this post, don't forget to subscribe!

సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) – వెస్టర్న్ రీజియన్ జిద్దాలో సంక్రాంతి సంబరాల వేడుక సభికులను ఉర్రూతలూగించింది.

శుక్రవారం జనవరి 12వ రోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ సంబరాలు , సంప్రదాయ పద్ధతిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించారు.



వినాయక పూజతో, ఆహ్లాదకరమైన పాటలతో, అచ్చ తెలుగు ఇంటి పండుగ వాతావరణంలో, అందమైన రంగవల్లులతో , అత్యద్భుతమైన అలంకరణతో ఇంకా కమ్మనైన విందు భోజనాలతో ఎంతో ఉల్లాసంగా జరిగింది.

మహిళలు తయారు చేసిన అచ్చమైన సంక్రాంతిని తలపించే పండగ నమూనాలతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గౌరవనీయులు డాక్టర్ శ్రీనివాస్ గారి స్త్రోత్రం , గాయకులు Amzad గారు మరియ గోపి గారి పాటలతో సభికులు మైమర్చిపోయారు.

గౌరవనీయులు రాంబాబు గారి ఉపన్యాసం అందరినీ ప్రోత్సాహపరిచింది.

శ్రీమతి అన్నపూర్ణ గారు ప్రత్యేకమైన PPT తో ఇంకా ప్రశ్న వినోదంతో చిన్నారులకు సంక్రాంతి పండుగ విశిష్టత తెలియచేశారు.
ఈ ప్రదర్శన అందరికీ వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా కలిగించింది.



చిట్టిపొట్టి చిన్నారుల గేయాలు, పాటలు మరియు నృత్యాలు చూడముచ్చటగా ఉన్నాయ్. చిచ్చరపిడుగు లక్ష్మణ్ కర్రసాము ప్రదర్శన వీక్షకులని ఆశ్చర్యచకితులను చేసింది.
మహిళలు తమ ప్రత్యేకమైన నృత్యాలతో అందరినీ అలరించారు.
చిన్నారి మనస్వి హనుమాన్ చాలీసా ఆలపించి అందరి దీవెనలు అందుకుంది.
సంక్రాంతి విశేషాన్ని గురించి పిల్లలు ప్రదర్శించిన
నాటిక వినోదభరితంగా ఉంది.

సంబరాలకు వచ్చిన అన్ని జంటలు సంప్రదాయ దుస్తులతో ప్రదర్శించిన నడక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

చివరిగా నిర్వహించిన ఆటలు అందరికీ ఆహ్లాదకరంగా అనిపించాయి.

కార్యక్రమ నిర్వహణలో భాగంగా గౌరవనీయులు మహిళలకు మరియు చిన్నారులకు బహుమతులు ఇచ్చారు.



జిద్దా ఎక్జిక్యూటివ్ కమిటీ మరియు సభ్యుల జాబితా:

ఎక్జిక్యూటివ్ కమిటీ
శ్రీ నరేష్ కుమార్
శ్రీ రాజ బ్రహ్మం చారి
శ్రీ బాలాజీ
శ్రీ విజయ్ రెడ్డి
శ్రీ శివ రెడ్డి

ఆహార కమిటీ
శ్రీ డాక్టర్ శ్రీనివాస్
శ్రీ రాజ బ్రహ్మం చారి

స్టేజ్ కమిటీ
శ్రీమతి భార్గవి
శ్రీమతి మహేశ్వరి

నాటిక కమిటీ
శ్రీమతి శాంతి
శ్రీమతి భార్గవి

సాంస్కృతిక కమిటీ
శ్రీమతి రామలక్ష్మి
శ్రీమతి సుజాత
శ్రీమతి కవిత
శ్రీమతి లక్ష్మి
శ్రీమతి శరణ్య
శ్రీమతి మహేశ్వరి

ఆటల కమిటీ
శ్రీ బాలాజీ
శ్రీ విజయ్ రెడ్డి

మెంటార్ మరియు కన్వేయర్
శ్రీ రాంబాబు
శ్రీ డాక్టర్ శ్రీనివాస్

ఆడియో విజువల్
శ్రీ గోపి

ఆర్థిక మరియు కొనుగోళ్లు
SATA ఎక్జిక్యూటివ్ సభ్యులు

మున్ముందు జరుపాబోయే మరిన్ని పడంగ సంబరాలకు కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొనాలని జిద్దా ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!