Friday, November 22, 2024

AGENCY ACT : ఏజెన్సీ గ్రామాల్లో రెచ్చిపోతున్న అక్రమ వెంచర్ల మాఫియా….!

అధికారం మాదే…. అధికారులు మా వెంటే… అంటున్న రియల్ మాఫియా..!

ఆదివాసీ గూడాల్లో జోరుగా అక్రమ లే అవుట్లు….

అక్రమ లే అవుట్ల కోసం జోరుగా అక్రమ మొరం తవ్వకాలు….

మాములు నిద్ర మత్తులో అధికార యంత్రాంగం…

గతంలో ఏజెన్సీ చట్టాల కోసం పోరాడిన వ్యక్తికి దక్కని ప్రాణాలు

అధికారం ముసుగులో రెచ్చిపోతున్న ప్రజాప్రతినిధులు…. !?

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఇప్పటికే ఏజెన్సీ గ్రామమైన ఇచ్చోడ లో ఆదివాసీలు ఒక్క ప్లాటు కొనకుండా , వ్యాపారం చేసుకోకుండా 95 శాతం తమ ఆధీనంలో తీసుకున్న బడా బాబులు , రియల్టర్ లు, భవిష్యత్తులో కూడా  ఆదివాసులు తమ సొంత ఇలాకాలో ఒక ప్లాటు కూడా కొనకుండా చేస్తున్నారు.
భవిష్యత్తులో వారి అవసరాలకు తగ్గట్టుగా ఇండ్ల నిర్మాణం కొరకు జానడు జాగ లేకుండా రియల్టర్ లు రెచ్చిపోతున్నారు.
వ్యాపార కేంద్ర బిందువుగా ఇచ్చోడ ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల తో పాటు జిల్లా కేంద్రం నుండి కూడా పలువురు ఇక్కడ ప్లాట్లు భూములు కొనుకుంటున్నారు. కమర్షియల్ ప్రాంతం కావడం తో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులు వస్తే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశం ఉండడం తో అప్పట్లో గిరిజన ఆదివాసీల కోసం ప్రత్యేక చట్టం , పాలన నియమాలను చేర్చారు.  కానీ బడా బాబుల ధనం ముందు ఇవన్నీ పనిచేయడం లేదు. దర్జాగా రోజుకో వెంచర్ ఆదివాసి గ్రామాల్లో పుట్టుకొస్తున్నాయి. అధికారులు సైతం అక్రమ వెంచర్ దారులు పడేసే మాములుతో వారి వైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే ఇచ్చోడ పరిసర ప్రాంతాల్లో సామాన్యుడు ఒక గజం భూమి కొనలేని పరిస్థితి నెలకొంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఇచ్చోడ , దుబార్ పెట్ , గుబ్బ వంటి గ్రామాల్లో జోరుగా లే అవుట్లు తీస్తున్నారు. వాస్తవానికి అక్కడ 90 శాతం ప్రజలు ఆదివాసులే  నివాసం ఉంటున్నారు. భవిష్యత్తు తరానికి ఇల్లూకట్టుకోవడానికి జానెడు జాగా దొరికే పరిస్థితి కనిపించడం లేదు.
అక్రమ వెంచర్ అన్నారు… తీరా ఇదిగో ఇలా…!

ఆదివాసుల ఫిర్యాదు పై అధికారుల స్పందన కరువు….

  ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని అప్పటి ప్రభుత్వాలు ఏజెన్సీ చట్టాలను తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ఆదివాసులకి అన్ని హక్కులను కల్పించారు.  అదేవిధంగా ఏజెన్సీ గ్రామాలలో ఏలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న పేసా చట్టం పరిధిలో పేసా కమిటీ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది.  నేటి ప్రభుత్వ అధికారులు వీటన్నిటికీ మంగళం పాడేస్తున్నారు.  తరచు ఆదివాసులు తమ హక్కుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.  తమ హక్కులు కాలరాస్తున్నారు దయచేసి మా హక్కులను కాపాడండి అని అంటున్న అధికారులకు విన్నవించుకుంటున్నా  పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు.
పక్షం రోజుల క్రితం ఓ వ్యక్తి ఇచ్చోడ నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేస్తున్నాడని , రేపటి రోజు లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు ఇచ్చిన మరుసటి రోజు నుండి సదరు వ్యక్తి భవన నిర్మాణంలో వేగం పెంచేసి పనులు మొదలు పెట్టేశాడు. రాత్రి పగలు నిర్మాణా పనులు చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి ఉద్దేశ్యం ఏమిటంటే భవన నిర్మాణం చేసుకుని ఇంటి నెంబర్ తీసుకుంటే ఎవరేమి చేయలేరు అనే భావన.
ఇలా అనేక సందర్భాలలో వివిధ ఆదివాసీ సంఘాలు ఏజెన్సీ చట్టం , పేసా కమిటీ రక్షణ కోసం పోరాడుతూ , అధికారులకు ఫిర్యాదు చేస్తున్న వాటి పై అధికారులు ఎలాంటి యాక్షన్ తోసుకోవడం లేదు.

ఏజెన్సీ చట్టాల పరిరక్షణ , అక్రమ లే అవుట్ల పై చర్యలు తీసుకోవాలని డి ఎల్ పిఓ కు వినతి పత్రం సమర్పిస్తున్న ఆదివాసీ సంఘాల నాయకులు (పాత చిత్రం)
ఏజెన్సీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టిన వ్యక్తి పై చర్య తీసుకోవాలని ఎస్సై పి ఉదయ్ కుమార్ కు ఫిర్యాదు చేస్తున్న జై ఆదివాసీ యువ శక్తి సంఘం సభ్యులు…
జై ఆదివాసీ యువ శక్తి సంఘం సభ్యులు ఫిర్యాదు చేసిన రోజు నిర్మాణం..
ఆదివాసీలు ఫిర్యాదు చేయడం తో జోరందుకున్న నిర్మాణం పనులు ..

ఏజెన్సీ చట్టం , పేసా చట్టం , డిటిసిపి ఏది లేకుండానే జోరుగా లే అవుట్లలో విక్రయాలు జరుగుతున్నాయి.

ఏజెన్సీ చట్టం కోసం పోరాడుతున్న ఓ వ్యక్తిని….

గతంలో ఇచ్చోడ మరియు ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన , చేసుకున్న నిర్మాణాల పై ఓ  ఆదివాసీ వ్యక్తి ఉట్నూర్ కోర్టులో కేసు వేసి అందరికి నోటీసులు పంపాడు. అయితే ఎక్కడ తమ భూములు , ప్లాట్లు  , భవనాలు ఎల్టీఆర్ (LTR) క్రింద ప్రభుత్వ స్వాధీనలోకి వెళ్లిపోతాయో అని ,  ఆ ఆదివాసీ వ్యక్తిని కొంతమంది దారుణంగా చంపేసిన సంఘటన కూడా గతంలో చోటుచేసుకుంది.

అక్రమ వెంచర్లు అని ఫ్లెక్సీ పెట్టారు…. తర్వాత ఏమైందో…. !?

అధికారులు చర్యలు తిసుకున్నట్లు నటించారా… !?….  లేక మరేదెన్న ఆశించి….వదిలేశారా…!?
అక్రమ వెంచర్ల వైపు చూడడం లేదా అనే అనుమానాల నడుమ…


డిఎల్పీఓ ధర్మరాణి సమక్షంలో అక్రమ లే అవుట్ల పై చర్యలు తీసుకుంటున్న గ్రామపంచాయతీ అధికారులు ( పాత చిత్రం)
ఇది ఇల్లిగల్ అని ఇలా ఫ్లెక్సీ పెట్టారు…. (పాత చిత్రం)
గతంలో అధికారులు అక్రమ వెంచర్ల పై కొరడా ఝులిపిస్తున్నామని పేర్కొంటూ వెంచర్లలో వేసిన ప్లాట్ల హద్దురాళ్లు , రోడ్లను బ్లెడ్ ట్రాక్టర్ల ద్వారా చదును చేసి , ఇవి అక్రమ లే అవుట్లు , వీటిలో ఎవరు ప్లాట్లు కొనుగులో చేయరాదు అని ప్లెక్సీలు పెట్టి మరి ప్రచారం చేశారు. మళ్లీ అట్టి లే అవుట్లలో ప్లాట్లు క్రయవిక్రయాలు చేస్తే ఆ భూమిని ప్రభుత్వ అధీనంలో తీసుకుంటామని మీడియా ముఖంగా చెప్పారు అధికారులు.



కానీ అవన్నీ గాలి మాటలే అని రుజువు కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. అప్పుడు ఏదైతే ఇల్లిగల్ లే అవుట్లు అని గ్రామపంచాయతీ అధికారులు చర్యలు తీసుకున్నారో  అదే లే అవుట్లకు అధికారులు పంచాయితీ సిబ్బందితో కలిసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అక్రమ లే అవుట్ల లో విద్యుత్ స్తంభాలు ఎలా ఏ విద్యుత్  అక్రమ లే అవుట్లు అని ప్లెక్సీ పెట్టిన అధికారులే అన్ని రకాల పంచాయితీ అనుమతి ఇచ్చి కరెంట్ సౌకర్యం మరియు మిగతా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ప్లాట్లు కొన్నవారికి టాక్స్ రశీదు ఇచ్చేసి తమ వంతు పుణ్యం కటరుకుంటున్నారు. జనం మాత్రం అధికారుల వేషాలు అర్థంకాక తలపట్టుకుంటున్నారు.

గతంలో రిపబ్లిక్ హిందుస్థాన్ లో వచ్చిన వార్త..
అక్రమ వెంచర్ అని ఇక్కడ కూడా ఫ్లెక్సీ కట్టారు. కానీ ఇక్కడ నిర్మాణం తో పాటు విద్యుత్ సౌకర్యం వచ్చేసింది… విద్యుత్ సౌకర్యం కింది ఫొటోలో చూడగలరు.

అక్రమ వెంచర్లలో ఇప్పటి నుండి విద్యుత్ సౌకర్యం కల్పించము..: ఎన్ సుబ్రహ్మణ్యం , ఏ డి ఈ , విద్యుత్ శాఖ ఇచ్చోడ

అక్రమ వెంచర్లలో విద్యుత్ సౌకర్యం పై విద్యుత్ శాఖ ఏడిఈ ఎన్ సుబ్రహ్మణ్యం ను వివరణ కోరగా …. ఆ వెంచర్లల్లో గత అధికారి హయాంలో అనుమతులు ఇవ్వడంతో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.  గ్రామపంచాయతీ అధికారులు అక్కడ విద్యుత్ సౌకర్యం అనుమతి కోరడంతోనే ట్రాన్స్ఫార్మర్రు ,  విద్యుత్ లైన్ వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.  అయితే ప్రస్తుతం మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిటిసిపి మరియు అవసరమైన అనుమతి ఉంటేనే విద్యుత్ సౌకర్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.

1/70 ఏజెన్సీ చట్టాలను పకడ్బందిగా అమలు చేయాలి

అక్రమ వెంచర్ల కోసం …. అక్రమంగా మొరం తవ్వకాలు..

అక్రమ వెంచర్లలో రోడ్ల కోసం జోరుగా ఇచ్చోడ చుట్టుపక్కల ప్రదేశాల్లో మొరం అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఇచ్చోడ గుట్టను కనుమరుగు చేసేసిన ఘనులు ప్రస్తుతం మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో జోరుగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు.

వెంచర్లలో రోడ్ల కోసం జరుపుతున్నా తవ్వకాలు

Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి