హెల్పింగ్ హాండ్స్ సభ్యుల ద్వారా 19500/- రూపాయల పెళ్లికి కిరాణా సరుకులు అందజేత
జనం కోసం సామాజిక సేవే మార్గం – జాటోత్ దవిత్ కుమార్
లింగాపూర్ : కొమురం భీమ్ జిల్లా, లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన తల్లిదండ్రులు లేని అనాధ ఆడబిడ్డ జాధవ్ స్వాతి పెళ్లికి అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ సామాజిక సేవకుడు జాటోత్ దవిత్ కుమార్ తమవంతు సహాయంగా మంగళవారం రూ.19500/- రూపాయల విలువగల కిరాణా సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
అయితే జాధవ్ స్వాతి అనే అనే అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. 2014 లో తెలంగాణ మలిదశ ఉద్యమంలో తండ్రి జాధవ్ విలాష్ నాయక్ స్వర్గస్థులు కాగా, తల్లి 2023 లో హఠాన్మరణంతో చనిపోయారు. తల్లిదడ్రులిద్దరూ మరణించడంతో ఆ నిరుపేద కుటుంబం దిక్కులేని అనాధగా మారింది. పిల్లల ఆలనా పాలనా చూసేవారు ఎవరు లేకుండా పోయారు. అటు పిల్లలు చదువుకుంటూనే ఒంటరి పొరుగా కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని నడిపించుకుంటూ వారే కుటుంబానికి పెద్ద దిక్కుగా తల్లిదండ్రులై సాటి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా ప్రతి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు *జాటోత్ దవిత్ కుమార్* పెద్దన్నగా వ్యవహారిస్తున్నారని గ్రామస్తులు వారి సేవా దృక్పథాన్ని కొనియాడారు. తల్లిదండ్రుల్లెని అనాధ ఆడబిడ్డ పెళ్లికి అండగా ఉండాలని ఉద్దేశంతో అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ సభ్యులు జాధవ్ సుశీల్, జాధవ్ మారుతి, జాధవ్ జైల్సింగ్, డాక్టర్ రాథోడ్ రాజశేఖర్, జాధవ్ అనిల్ (జూనియర్ పంచాయత్ సెక్రటరీ), మగ్రే సుమిత్ (ఎన్.ఆర్.ఐ టాంజానియా), జాటోత్ ధర్ము, ఆడే ప్రవీణ్ (ఎన్.ఆర్.ఐ దుబాయ్), పార్డే ధమ్మా, పవార్ దినేష్ ధనరాజ్, రాథోడ్ సంతోష్, జాటోత్ శివా సహకారంతో* తనవంతుగా సామాజిక సేవలో భాగంగా శుక్రవారం జరిగే పెళ్లికి నిత్యవసర సరుకులను అందజేయడం జరిగిందన్నారు. *పేద కుటుంబానికి అండగా నిలిచిన హెల్పింగ్ హాండ్స్ సభ్యులకు* ఆ అనాధ ఆడబిడ్డ స్వాతి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు హెల్పింగ్ హాండ్స్ సభ్యులు పెద్దన్నగా వ్యవహరిస్తూ, తనవంతుగా ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఎల్లప్పుడూ అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ పౌండేషన్ ద్వారా నిరుపేదలను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు.
HUMANITY OF ABHYUDAYA HELPING HANDS
Recent Comments