*అడిషనల్ కలెక్టర్ తనిఖీ తో వెలుగులోకి
*తనకంటూ ఓ గదిని ఏర్పాటు చేసుకున్న అటెండర్
*గదిని చూసి కంగుతిన్న కలెక్టర్
*సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ
రిపబ్లిక్ హిందుస్థాన్ , నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రలో ఉన్న ప్రభుత్వ సంక్షేమ బీసీ వసతి గృహాన్ని సోమవారం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స కోట ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డ్ లు తనకి చేసిన అనంతరం వసతి గృహ ఆవరణం, టాయిలెట్స్ మరియు బాత్రూంలను పరిశీలించి సిబ్బందిపై మండిపడ్డారు.
బయటపడ్డ హాస్టల్ అటెండర్ సాంబమూర్తి భాగోతం
ఇక్కడ అటెండర్ గా పనిచేస్తున్న సాంబమూర్తి వార్డెన్ కంటే ఎక్కువ. తన మాటే వేదం, తాను చెప్పినట్లు విద్యార్థులు, వార్డెన్ నడుచుకోవాలి. అయితే ఇది ఇలా ఉండగా సోమవారం వసతి గృహాన్ని అడిషనల్ కలెక్టర్ తనకి చేశారు. ఈ తనిఖీలలో హాస్టల్ గదులను పరిశీలిస్తుండగా, అటెండర్ సాంబమూర్తి గదిని చూసి అడిషనల్ కలెక్టర్ కంగుతిన్నాడు. గదిలో టీవీ సోఫా సెట్లు, పరుపు చూసి ఇది వసతి గృహమా? లేక లాడ్జ అనీ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సస్పెండ్ చేయాలని మెమో జారీ చేశారు.

వార్డెన్ కు సూచన
వసతి గృహంలో ఇంత తతంగం జరుగుతున్న పై అధికారులకు సమాచారం అందించకపోవడం హాస్టల్ వార్డెన్ రవి పై మండిపడ్డారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం ఫుడ్ పెట్టాలని, అలాగే హాస్టల్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

Recent Comments