వైష్ణవ సదన్ నారాయణ మహారాజ్ మాదాపూర్
ఇంద్రవెల్లి :
సనాతన హిందూ ధర్మ సంస్కృతి చాలా గొప్పదని ఈ హిందూ సంస్కృతిలో చెట్లని పశువులని జంతువులని పూజించే సంస్కృతి ప్రపంచంలోనే మన హిందూ ధర్మ సనాతన ధర్మంలో ఉందని వైష్ణవ సదన్ నారాయణ మహారాజ్ అన్నారు. ఆదివారం రాత్రి ఇంద్రవెల్లి మండలంలోని గిరిజనుల ఆరాధ్య దైవమైన కిస్లాపూర్ నాగోబా ఆలయం ఆవరణంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగే సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నారాయణ మహారాజుని ముఖ్య అతిథులుగా పిలిచి భజన సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మహారాజు మాట్లాడుతూ ఈరోజు నాగోబా ఆలయంలో భజన కీర్తన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని నా గొప్ప యొక్క విశిష్టతని భక్తులకు వివరించారు. శ్రీకృష్ణ భగవానికి అతి ప్రీతి మైనటువంటి నాగం పాము పైన కృష్ణుడు శయనం చేస్తాడని అన్నారు. నాగంబాము మొత్తం శరీరము పూర్తిగా చల్లగా ఉండడం ఉంటుందని ఇక్కడ అవుతే మంట ఉంటుందో ఆ మంటని తగ్గించడానికి చల్లగా ప్రశాంతంగా ఉండడానికి దేవతల సైతం పాము అంటే చాలా ఇష్టపడతారని అన్నారు అమృతం కోసం రాక్షసులకు దేవతలకు జరిగిన వీర యుద్ధంలో సముద్రం నుంచి విషయము వచ్చిన సమయంలో శివుడు విషయాన్ని మింగినప్పుడు శివుని శరీరమంతా మంట మంట కావడంతో ఆ సమయంలో శివుడు తన శరీరంలో ఉన్న మంటని తగ్గించడం కోసం పాముని తన మెడలో వేసుకొని తన శరీరంలో ఉన్నటువంటి విషపు మంటని తగ్గించుకున్నాడని అన్నారు. ప్రతి మనిషిలో పరమాత్ముడు ఉన్నాడని ప్రతి మనిషికి ఒక రోజు భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడని మనిషికి పెళ్లి రోజు పుట్టినరోజు మహిళలకు వస్తే మహిళా దినోత్సవం నంది దేవునికి పొలాల రోజు కుక్క కుక్క కాలభైరవ రూపంలో పూజిస్తారని అన్నారు. నేటి కాలంలో చీమలకు పశువులకు ఉన్న జ్ఞానం మనుషులు కల లేకుండా పోయిందని చీమలు ఒక వరుస దారిలోనే వెళ్తాయి వాటి పక్కకు ఎటువంటి తీపి పదార్థాలు పెట్టిన అవి వంగి సూడయ్యని అన్నారు కానీ అదే మనుషులవుతే చెడు వ్యసనాలకు బానిసహి తాగుడు మాంసం జూదాలకు అలవాటు పడి పూర్తి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. వారి పై పడే ఆధారపడి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని ప్రతి మనిషి సన్మార్గంలో నడవాలని ప్రతి రోజూ భగవన్నామ స్మరణము చేస్తే అటువంటి వ్యాధికి భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడని ఉన్నారు. ఈ కార్యక్రమంలో కిస్లాపూర్ పరిసర ప్రాంతాల్లోని భజన మండలి సంత మహిళా మండలి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
చెట్లను పశువులను జంతువులను పూజించే సంస్కృతి సాంప్రదాయం సనాతన హిందూ ధర్మం లో మాత్రమే ఉంది
RELATED ARTICLES
Recent Comments