రిపబ్లిక్ హిందుస్థాన్,విజయవాడ (మార్చి,29): విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి ఆశిస్సులతో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది పురస్కారాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ , ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావుతో పాటు వివిధ రంగాలకు చెందిన 67 మందికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ సభలో విశాఖ శారదా పీఠం ఉత్తరాదికారి స్వాత్మా నరేంద్ర స్వామి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రవచన కర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, తిరుమల ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రమణ దీక్షితులు, ప్రముఖ న్యాయవాది డాక్టర్ వరప్రసాద్, సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జ్వాలాపురం శ్రీకాంత్, సురేష్, కోశాధికారి పి పురుషోత్తమ శర్మ, గుండవరపు అమరనాథ్, పరసా రవి, పివీవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ లో ఘనంగా ఉగాది పురస్కారాలు
RELATED ARTICLES
Recent Comments