శరీరానికి ఎన్ని వ్యాధులు వచ్చినా నయం చేయడానికి మందులున్నాయి కానీ షుగర్ వ్యాధి వస్తే మాత్రం శాశ్వతంగా తగ్గడానికి మందుల్లేవు. ఎప్పుడూ నియంత్రణలోనే ఉంచుకుంటుండాలి.
Thank you for reading this post, don't forget to subscribe!అలా చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు షుగరు రోగులకు ప్రత్యేకమైన చాక్లెట్ ను తయారు చేశారు. శరీరంలో ఇన్సులిన్ అవసరాలను ఇది తీరుస్తుంది. వీటిని యూఐటీ ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ లు తయారు చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్లమంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా. అందులోను భారతదేశంలో రోజురోజుకు వీరి సంఖ్య పెరుగుతోంది. మారుతున్న జీవినశైలితోపాటు మారిపోయిన ఆహారపు అలవాట్లు కూడా మధుమేహం పెరగడానికి కారణమవుతున్నాయి. 42.5 కోట్ల మందిలో 7 కోట్ల మంది ఇన్సులిన్ ఇంజక్షన్లను తీసుకుంటున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇన్సులిన్ తీసుకొనే అవసరం లేకుండా మధుమేహం చికిత్సలో తోడ్పడే ఔషధాన్ని తయారు చేశారు. ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.
ఈ చాక్లెట్‌లో మానవ వెంట్రుకల కంటే చిన్న పరిమాణంలో ఉండే నానో క్యారియర్లు ఉంటాయి. శరీరం అవసరమైన సమయంలో ఇన్సులిన్ ను తయారుచేయలేనప్పుడు చాక్లెట్ ఇన్సులిన్ సమతుల్యను పెంచేందుకు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి స్థాయులు పెరిగినప్పుడు, ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌లు చురుకుగా మారతాయి. ఇలా మారి ఆ పూతను విచ్ఛిన్నం చేయడంతో అది కరిగిపోయి ఇన్సులిన్ విడుదల చేస్తుంది. తద్వారా అది రక్తం నుంచి చక్కెరను తొలగిస్తుంది. శరీరంలో షుగరు పెరిగితే ఆటోమాటిక్ గా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది.
దీన్ని డయాబెటిక్ ఎలుకలపై కూడా పరీక్షించారు. వీటిల్లో కూడా సానుకూల పరిణామం కనపడింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని పరిశోధకులు వెల్లడించారు. వచ్చే సంవత్సరం దీన్ని మనుషులపై ప్రయోగిస్తారు. అనంతరం రెండు సంవత్సరాల్లో మార్కెట్ లోకి రానున్నాయి.
Recent Comments