Tuesday, July 8, 2025

SBIలో కోటిన్నర విలువైన బంగారం చోరీ!

ఈ మధ్యకాలంలో అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. కొందరు సుఖంగా, తక్కువ సమయంలో ఎక్కువ ధనం సంపాదించాలని ఆశ పడుతున్నారు.

ఈ క్రమంలో సామాన్యులు కాయాకష్టం చేసి దాచుకునే సొమ్మును అందిన కాడికి దోచుకెళ్తున్నారు. ఇళ్లు, షాపులు, బ్యాంకులు..ఇలా ఎక్కడ పడితే అక్కడ చోరీలు చేసి.. భారీ మొత్తంలో బంగారం, వస్తువులు, డబ్బులను దోచుకెళ్తున్నారు. నిత్యం అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద చోరీలు జరిగి.. కోట్లు విలువ చేసే వస్తువులు, నగదు మాయమవుతున్నాయి. తాజాగా ఏపీలోని ఓ ఎస్బీఐ బ్యాంకులో భారీ దొంగతనం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి ప్రాంతంలో ఎస్బీఐ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకులో గురువారం భారీ చోరీ జరిగింది. నిన్న రాత్రి సుమారు రూ.30 లక్షల నగదు, రూ.కోటిన్నర విలువ చేసే బంగారం అపహరణకు గురైంది. బ్యాంక్ వెనుక భాగంలో కిటికీ డ్రిల్స్ ను గ్యాస్ కట్టర్ తో తొలగించి దుండగులు బ్యాంకులోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఉదయం రోజూ మాదిరిగానే బ్యాంక్ కి వచ్చిన సిబ్బంది చోరీని గుర్తించారు. బ్యాంకు వెనుక వైపు కిటికీలు తొలగించి ఉండటాన్ని సిబ్బంది

గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు దొంగతనం గురించి సమాచారం ఇచ్చారు. దొంగతనం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగతన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి..విచారణ చేపట్టారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గతంలోనూ బ్యాంకుల్లో చోరీలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలానే బంగారు షాపులు, నివాస ప్రాంతాల్లో దుండగులు చోరీలకు పాల్పడే వారు. అనేక వెరైటీ పద్ధతుల్లో చోరీలకు పాల్పడుతూ.. పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కేవలం ఇళ్లలో సొమ్మునే కాకుండా వాహనాలను, సెల్ ఫోన్లు, వంటివి కూడా దొంగతనం చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో బ్యాంకు సిబ్బందే..దొంగలకు సహకరించిన ఘటనలు ఉన్నాయి. ఈ దొంగతన కేసుల్లో చాలా వరకు పోలీసులు ఛేదించి..నిందితులను పట్టుకుంటున్నారు. అలానే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కూడా కొందరిలో మార్పులు రావడం లేదు.

కొందరు తమ పాత పద్ధతిలోనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాము చోరీ చేయాల్సిన ప్రాంతంపై రెక్కీ నిర్వహించి..మరీ పక్క ప్లాన్ వేసుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమింటే.. ఏటీఎం డబ్బాలను కూడా వదలడం లేదు. వాటిని కూడా ఇనుప రాడ్డులతో పగలగొట్టి లక్షల్లో నగదును చోరీ చేసి చేస్తున్నారు. తాజాగా కాకినాడ ఎస్బీఐ బ్యాంకులో కూడా అదే తరహాలో ఈ భారీ చోరీ జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి