రిపబ్లిక్ హిందుస్థాన్, భద్రాద్రి కొత్త గూడెం : సోమవారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు ఐటిడిఎ ఏవో లను కలిసి జీసీసీ లో జరుగుతున్న అక్రమణల పై నంగరాభేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
నాణ్యతలేని నిత్యవసర స్టాక్ వస్తువులను జీసీసీ సరఫరా చేయడం వలన గిరిజన విద్యార్థులు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని అన్నారు.
కొంతమంది జీసీసీ అధికారులు దళారులతో కుమ్మక్కై అతి తక్కువ ధరలతో నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి, గిరిజన వసతి గృహాలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
దళారులతో కుమ్మక్కయిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
గొడ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సొందే వీరయ్య, గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి – తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కొమరం బుచ్చయ్య, ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు పంతుల్య నాయక్, జిల్లా గౌరవ అధ్యక్షులు బానోత్ రాము నాయక్, లావూరి శ్రీనివాస్ నాయక్ , జిల్లా అధ్యక్షులు, ఎల్ ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు రాజేష్ రాథోడ్ లు పాల్గొన్నారు.
జిసిసి అధికారుల అవినీతి అక్రమాలపై ఫిర్యాదు
RELATED ARTICLES
Recent Comments