Andhra Pradesh : ఏలూరులో బైకుపై టపాసులు firecrackers explosion in Eluru ( Andhra Pradesh) తీసుకెళ్తుండగా పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో బయటకు వచ్చింది. ఉల్లిపాయ టపాసుల బాంబు బస్తా పేలడంతో సుధాకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. గాయపడిన వారిలో తాబేలు సాయి, సువార శశి, శ్రీనివాసరావు, ఖాదర్, సురేష్, సతీష్‌లు ఉన్నారు. బైక్ గోతిలో పడి లేవడంతో ఒక్కసారిగా ఉల్లిపాయ బాంబులు పైకి లేచి తిరిగి బస్తాలో పడి పేలుడు సంభవించింది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments