*ఆగని ఫర్టిలైజర్ షాప్ ల దందా
*అత్యుత్సాహం చూపుతున్న ఫర్టిలైజర్ వ్యాపారులు
*మామూళ్ల మత్తులో వ్యవసాయ శాఖ
*పట్టించుకోని అధికారులు
*మోసపోతున్న రైతులు
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాప్ వ్యాపారుల ఆగడాలకు, అక్రమ దందాకు హద్దు అదుపు లేకుండా పోతుందనీ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా నకిలీ మరియు ప్రభుత్వా నిషేధిత విత్తనాలు, మందులు అమాయక రైతులకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విక్రయించిన విత్తనాలు మరియు మందులకు తగిన రసీదులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. మండల కేంద్రంలో ఇంత తతంగం జరుగుతున్న వ్యవసాయ శాఖ అధికారులు, మాత్రం నిమ్మకు నీరు ఎత్తన్నట్లు వ్యవహరించడం గమనార్హం.
ఫర్టిలైజర్ వ్యాపారులతో ఏవో కుమ్మక్కు
స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారి (ఏవో) అండదండలతోనే నకిలీ విత్తనాలు, మరియు ప్రభుత్వ నిషేధిత మందులను ఫర్టిలైజర్ వ్యాపారులు దర్జాగా షాపులలో ఉంచి విక్రయిస్తున్నారు. ఫర్టిలైజర్ వ్యాపారులతో ఏవో కుమ్మక్కై వారి నుండి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని చర్యలు తీసుకోకుండా వారికి అండగా ఉంటున్నారనే ఆరోపణలు ప్రజల నుండి వస్తున్నాయి.
ఇప్పటికైనా స్పందించి
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫర్టిలైజర్ షాపులో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి వారి ఆగడాలకు, చెక్ పెట్టాలని, అలాగే ఎరువుల దుకాణాలలో విత్తన మరియు పురుగు మందుల ధరలను డాష్ బోర్డులో ఉంచి రైతులకు కనపడేలా ఏర్పాటు చేయాలని, నకిలీ ఎరువులు ప్రభుత్వ నిషేధిత పురుగుమందులను విక్రయించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Recent Comments