▪️ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మ గూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది….
రిపబ్లిక్ హిందుస్థాన్, మహబూబాబాద్ జిల్లా : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. కొన్ని సంఘటనల్లో విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు అప్పుడప్పుడు సభ్య సమాజం తలదించుకోలేలా చేస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మ గూడెం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బానోత్ ప్రవళికను ఉపాధ్యాయుడు సూర్య మెడపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న వార్డెన్ అమ్మాయికి ఆయిట్ మెంట్ గోళీలు ఇచ్చి విషయం బయటకి పొక్కకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసింది. అయితే రెండవ రోజు మెడ నరాలు మొత్తం పట్టి వేయడంతో విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పరిస్థితి చేయి దాటి పోవడంతో ఏమీ చేయలేక హాస్టల్ వార్డెన్ బాలికను మహబూబాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. విద్యార్థినిని కొట్టిన ఉపాధ్యాయులతో పాటు వార్డెన్ పై తక్షణమే చర్యలు చేపట్టాలని గిరిజన సంఘాలు మరియు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Recent Comments