రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
ఇచ్చోడ మండలం లోని తలమద్రి గ్రామంలో మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారంబ తలమద్రి గ్రామానికి చెందిన గుల్లే శంకర్ కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు గుల్లే పూజ (19) ఇచ్చోడ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుకుంటున్నట్లు తెలిపారు. అయతే పూజ ల ఇరవై రోజుల క్రితం కళాశాల నుండి ఇంటికి వెళ్ళింది. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నా పూజ తనను ప్రైవేట్ కళాశాలలో చదివించాలని తల్లిదండ్రులను కోరింది. దీనికిగాను పూజ తండ్రి గుల్లే శంకర్ ఇంకా రెండు నెలలు గడిస్తే రెండవ సంవత్సరం పూర్తి అవుతుందని, డిగ్రీ మూడో సంవత్సరం లో ప్రైవేట్ లో చదివిస్తానని ఆమెతో చెప్పడం జరిగిందని తెలిపారు. అయితే ప్రభుత్వ కళాశాలలో వెళ్లడానికి ఇష్టపడని విద్యార్థిని తనను ప్రైవేట్ కళాశాలలో ఎక్కడ చదివిస్తారు భావనతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు.
Recent Comments