🔴 రూ.4100/- నగదు, మట్కా చిట్టీలు స్వాధీనం,ముగ్గురిపై కేసు నమోదు….
🔴 స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మట్కా, గుట్కా స్థావరల పై కొనసాగుతున్న దాడులు
ఆదిలాబాద్ : సోమవారం స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బృందం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఏరియా లో ని హ్యాండీక్యాప్డ్ కాలనీ వద్ద మట్కా నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు తనిఖీ చేయగా నిందితుడు షేక్ ఇమ్రాన్ ను అరెస్టు చేయడం జరిగిందని స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి తెలిపారు. నిందితుడి వద్ద నుండి వద్ద నుండి రూ.4100/- నగదు తో పాటు మట్కా చిట్టిలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇతనితో పాటు షేక్ ముజీబ్, షేక్ ఖలీల్ లు కలిసి మట్కా నిర్వహిస్తున్నారని వీరిపై కూడా ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నారు.
ఈ ఆపరేషన్ నందు ఎస్బి ఎస్ఐ లు కె విఠల్, ఎస్ అశోక్, సిబ్బంది జాకీర్, జీ విష్ణు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments