ePaper
Thursday, March 12, 2026
📄 ePaper

సీఎం కేసీఆర్ వ్యాఖ్యల పై భగ్గుమన్న దళిత సంఘాలు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!
  • – కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్

రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇంద్రవెల్లి : భారత రాజ్యాంగాన్ని మార్చాలాంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నీరసనగా బుధవారం దళిత, బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ముందుగా అంబేద్కర్ భవనం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు.


ఈ సందర్బంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే సర్వ శ్రేష్ఠమైన భారత రాజ్యాంగంను మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రాజ్యాంగం వల్లనే సాధ్యం అయిందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు. యావత్ దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పి, సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రం మొత్తం ధర్నాలు, రాస్తారోకోలు చెప్పడతామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పెద్దమొత్తంలో దళిత సంఘాల నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!