రిపబ్లిక్ హిందుస్థాన్, వెబ్ డెస్క్ : ఆధార్ ఫింగర్ ప్రింట్స్ తో కోట్ల రూపాయల్లో ప్రజలకు మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర నేరస్తుడి గుట్టురట్టు చేసిన వై.ఎస్.ఆర్ జిల్లా పోలీసులు.
ఆధార్ కార్డు కు అనుసంధానంగా ఉన్న వేలి ముద్రలను క్లోనింగ్ చేసి జనాల బ్యాంక్ అకౌంట్ ల నుంచి వారికి తెలియకుండా నగదు కాజేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అరెస్టు చేసిన జిల్లా పోలీసులు…
అంతర్ రాష్ట్ర సైబర్ నేరస్తుడు ఆధార్ ఆధారిత సమాచార దుర్వియోగం కేసులో గోరఖ్ పూర్, ఉత్తప్రదేశ్ కు చెందిన శేష నాథ్ విశ్వకర్మ అలియాస్ శేష్ నాధ్ శర్మ (27) అనే నిందితుడి అరెస్ట్….
ప్రత్యేక పోలీస్ టీమ్ నేడు మరో ఇద్దరు ముఠా సభ్యులను ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టు చేసి జిల్లా కు తీసుకు వస్తున్నట్లు ఎస్.పి కె.కె.ఎన్ అన్బు రాజన్ ఐ.పి.ఎస్ వెల్లడించారు.
జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బు రాజన్ మీడియా సమావేశం లో సమాచారం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి…
దేశంలోని పలు రాష్ట్రాలలో సుమారు 440 మంది యొక్క వేలి ముద్రలను తయారు చేసి బ్యాంకు ఖాతా లోని నగదు ను కొల్లగొట్టిన కేటుగాళ్ళు….
👉 బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ (CSP) అనుమతి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడి..
👉 నిందితులపై దేశావ్యాప్తంగా NCRP పోర్టల్ లో 308 ఫిర్యాదులు…128 FIR లు నమోదు.. మూడు హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ఖాతాల ద్వారా మోసానికి పాల్పడిన నిందితులు..
👉 నిందితుడి వద్ద నుంచి IGRS పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసిన ఒక లక్ష ఆధార్ నెంబర్లు, లక్ష వేలి ముద్రలు ఉన్న హార్డ్ డిస్క్, స్కానర్, రెండు సెల్ ఫోన్లు, ఫింగర్ ప్రింట్స్ డివైస్, ఒక మానిటర్….
👉 జిల్లాలో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు….ఎస్పీ కె.కె.ఎన్ అన్బు రాజన్
👉 ప్రజలందరూ తమ ఆధార్ కార్డుల బయోమెట్రిక్ లాక్ లేదా తగు భద్రత చర్యలు తీసుకోవాలి….
అదనపు ఎస్పీ (అడ్మిన్) తుషార్ డూడి ఐ.పి.ఎస్ పర్యవేక్షణ లో కేసు చేధించిన ఫ్యాక్షన్ జోన్ డిఎస్పీ చెంచుబాబు, సైబర్ క్రైమ్ సీ.ఐ శ్రీదర్ నాయుడు, చిన్న చౌక్ సీ.ఐ శ్రీరామ్ శ్రీనివాస్, ఎస్సైలు మధు మల్లేశ్వర్ రెడ్డి, అమర్ నాధ్ రెడ్డి, రవి కుమార్, శ్రీనివాస్ మరియు సిబ్బంది ని జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ అభినందించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments