పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : భార్యభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో కోపం లో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇచ్చోడా మండల కేంద్రం లో చోటు చేసుకుంది.
ఇచ్చోడా ఎస్సై మరియు మృతుని భార్య తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రవెల్లి మండలం దోడుంబా గ్రామానికి చెందిన కుంరం విజయ మరియు కుమ్రం లాల్ షావ్ తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. విజయలక్ష్మి వృత్తి రీత్యా స్టాఫ్ నర్స్. ఆమెకు ఇచ్చోడా ప్రభుత్వ ఆసుపత్రి కి 8 నెలల క్రితం ఉద్యోగ బదిలీ కావడం తో ఇచ్చోడా మండల కేంద్రం లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
అయితే శనివారం రాత్రి భార్యభర్తలా మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. కోపం లో విజయలక్ష్మి తన కూతురు అనేష్య (4) నూ తీసుకుని ఇంద్రవెల్లి మండలంలోని తన అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఒక్కడే ఉన్న లాల్ లాల్ షావ్ గుర్తు తెలియని పురుగుల మందు తాగి మృతిచెందాడు. గమనించిన చుట్టూ పక్కల వారు విజయ లక్ష్మి కి ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపారు. విజయలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి చూడగా అప్పటికే అతను మృతి చెంది యున్నాడు. తన భర్త జీవితం పై విరక్తి చెంది క్షణికావేశంలో ఆత్మహత్య చేసున్నట్లు, ఎవరి పై ఎలాంటి అనుమానం లేదని మృతి భార్య తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇచ్చోడా ఎస్సై పి ఉదయ్ కుమార్ తెలిపారు.


Recent Comments