వికారాబాద్ జిల్లా: డిసెంబర్08
వికారాబాద్ జిల్లా తాం డూర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉపాధి పేరుతో మహిళలను కిడ్నాప్ చేసి వరుస హత్య లకు పాల్పడుతున్న కిష్టప్ప అనే సైకో కిల్లర్‌ను పోలీ సులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇటీవల వికారా బాద్ జిల్లాలో జరుగుతోన్న మహిళల వరుస హత్య లను పోలీసులు చేధించారు.
కాగా, రెండు రోజుల క్రితం అడ్డా మీద ఉన్న ఓ మహిళను పని కల్పిస్తానని చెప్పి తీసుకెళ్లి సైకో కిష్టప్ప హత్య చేశాడు. మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు సీసీ ఫుటేజీ పరిశీలించగా.. చివరగా కిష్టప్ప మహిళతో మాట్లాడి ఆమెను తీసుకు వెళ్లినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు.
దీంతో కిష్టప్పను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డట్లు పోలీసులు వెల్లడించారు.
మహిళను చంపి మూట గట్టి పడేసిన సైకో కిష్టప్ప విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉపాధి పేరుతో ఇప్పటి వరకు ఆరుగురు మహి ళలను హత్య చేసినట్లు సైకో కిష్టప్ప అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం సైకో కిష్టప్ప తాండూర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వికారాబాద్ జిల్లాలో సైకో కిల్లర్ అరెస్టు
Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES


Recent Comments