మ్యాడంపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి
జగిత్యాల జిల్లా మాల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామశివారులోని చెట్ల పొదల్లో మహిళ చనిపోయిపడి ఉండటంతో అటుగా వెళ్లిన రైతులు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సీఐ నీలం రవి సిబ్బందితో చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Recent Comments