చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ గ్రామంలో జరిగిన దారుణం..
నల్గొండ జిల్లా : మెట్టు మహంకాళి దేవాలయం దగ్గర మొండెం నుండి వేరు చేసిన తలను అమ్మవారి పాదాల దగ్గర దిమ్మెపై వదలి వెళ్లిన దుండగులు.
మొండెం లేని తలను చూసి భయకంపితులయ్యారు. ఈ వార్త దావానలంలా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను ఆరా తీశారు.
హైదరాబాద్-నాగార్జున సాగర్ హైవేపై ఈ గ్రామం ఉంది. శ్రీ మెట్టు మహంకాళి దేవాలయం హైవే రోడ్డుకు ఆనుకునే ఉంటుంది. ఆ వ్యక్తిని వేరే చోట హత్య చేసి.. తలను మాత్రం విగ్రహం దగ్గర పెట్టి దుండగులు పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొండేన్ని మరోచోట వదిలి ఉండొచ్చని భావిస్తున్నారు.
నిన్న ఆదివారం కావడంతో క్షుద్రపూజలు చేసి నరబలి ఇచ్చారేమోనన్న వదంతులతో స్థానికుల్లో భయాందోళన కనిపిస్తోంది. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు


Recent Comments