భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం ఉదయం చోటు చేసు కుంది.
ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాను ఢీ కొనడంతో డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన రేగొండ మండ లం బాగిర్తిపేట క్రాస్ వద్ద ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా బస్ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగా త్రులను చికిత్స నిమిత్తం పరకాల హాస్పిటల్‌కు తర లించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఉదయం పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.
Recent Comments