రిపబ్లిక్ హిందుస్థాన్ , బోథ్ : బోథ్ మండలంలోని సోనాల ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఓ ఉపాద్యాయుడికి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా భయాందోళనకు వాతావరణం ఏర్పడింది. పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి వచ్చినట్లు తెలిపారు. సోమవారం రోజు పాఠశాల విధులకు హాజరయిన సదరు ఉపాధ్యాయుడు దగ్గుతో బాధపడుతున్న విషయాన్ని గమనించిన హెడ్ మాస్టర్ సదరు ఉపాద్యాయుడికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకో గా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. పాఠశాలలో మొత్తం ఆరు వందల అరవై మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు , విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
సదరు ఉపాద్యాయుడు కరోన వ్యాక్సిన్ రెండు టీకాలు కూడా వేసుకున్నట్లు సమాచారం.
సదరు ఉపాధ్యాయుడు స్థానికంగా ఓ జాతరకు సైతం హాజరయినట్లు సమాచారం.
సోనాల జడ్పి పాఠశాలలో కరోన కలకలం
Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES


Recent Comments