– ఇంధన ధరల పెంపుపై ధర్నా…
– సామాన్యునికి భారంగా మారిన ఇంధన ధరలు
– సిలిండర్లకు పూజలు చేసిన మహిళ కాంగ్రెస్ కార్యకర్తలు
– పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్
రిపబ్లిక్ హిందూస్తాన్, నల్లబెల్లి : ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ వీధుల్లోకి వచ్చింది. టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని గుండ్ల పహాడ్ గ్రామంలో గురువారం పెట్రోల్, డీజిల్ వంటగ్యాస్ ధరల విపరీతమైన పెరుగుదలకు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు గ్యాస్ సిలిండర్లకు పూలదండలు వేసి నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెంపు సామాన్యుడికి భారంగా మారిందన్నారు. పేదల నుండి కేంద్రం డబ్బులు దండుకుని బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వెళ్ళు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్, సర్పంచ్ కటయ్య, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చర్ల శివారెడ్డి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments