వేడెక్కిన చెన్నూర్ రాజకీయం
మంచిర్యాల, నవంబర్ 6 (రిపబ్లిక్ హిందూస్తాన్):
చెన్నూర్ కాంగ్రెస్ సీటు వివేక్ వెంకటస్వామి కి కేటాయించడంతో చెన్నూర్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.చెన్నూర్ లో రాజకీయా సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి.పొద్దున ఒక పార్టీలో ఉంటే సాయంత్రానికే ఇంకో పార్టీలో ఉంటున్నారు.దీంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటున్నమో అని అయోమయానికి గురవుతున్నారు.కాంగ్రెస్ పుంజుకుంటున్న తరుణంలో ఎం ఎల్ ఏ టికెట్ ఆశించిన పిసిసి డాక్టర్ సెల్ వైస్ చైర్మన్ దాసారపు శ్రీనివాస్ కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీ లో చేరి బీఎస్పీ తరుపున చెన్నూర్ నియోజకవర్గం నుండి ఎంఎల్ఏ గా బరిలో నిలిచారు.పోటి చేస్తున్నారు.అదే దారిలో డాక్టర్ రాజా రమేష్ రాజీనామా చేశారు.రాజా రమేష్ బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.బోడ జనార్దన్ రాజీనామా చేశారు.మందమర్రి లో జరిగే భహిరంగ సభలో కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.దీంతో కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారంతా టికెట్ రాకపోవడంతో పార్టీని వీడుతున్నారు.ఇదే అదునుగా రాజీనామా చేసిన వారిని బిఆర్ఎస్ వైపు తిప్పుకోవడానికి బల్కసుమన్ పావులు కదుపుతున్నారు.వివేక్ రాకతో కాంగ్రెస్ బలపడింది అనుకుంటే టికెట్ ఆశించిన వారంతా ఒక్కోక్కరిగా పార్టీని వీడడంతో కాంగ్రెస్ కు కొంత ప్రతికూలంగానే ఉంటుందని అనుకుంటున్నారు.కానీ సోమవారం రోజున మంచిర్యాల మాజీ ఎం ఎల్ సి ప్రేమ్ సాగర్ రావు ఆయన నివాసంలో బెల్లంపల్లి కాంగ్రెస్ ఎంఎల్ఏ అభ్యర్థి వినోద్,చెన్నూర్ ఎంఎల్ఏ అభ్యర్థి వివేక్ కలిశారు.ఒకప్పుడు వీరంతా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఏలిన వారే,ఈసారి వారంతా అందరూ కలిసి కట్టుకుగా పని చేస్తే మంచిర్యాల జిల్లా లో కాంగ్రెస్ కి ఎదురులేకుండ ఉంటుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు కానీ వీరికి క్యాడర్ సహరిస్తుందా…? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకం..? ద్వితీయ శ్రేణి నాయకలతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు.ఏదేమైనప్పటికి మంచిర్యాల జిల్లాలో ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని అభ్యర్థులు ధీమాతో ఉన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments