రైతులను ఇబ్బంది పెడితే రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నా గిరిజన నాయకులు
సేవాలాల్ బంజారా సంఘం మహిళా నాయకురాలు సక్రీ బాయి
రిపబ్లిక్ హిందుస్థాన్ , హైదరాబాద్ :
హైదరాబాద్ లో విలేకర్ల సమావేశంలో సేవాలాల్ బంజారా సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సక్రీ బాయి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు వడ్లు అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారని , యాసంగి వరి వెయ్యదంటు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వడ్లు కోనబోమంటు వరి వెయ్యొదంటు సర్క్యులర్ ఇచ్చిందనీ కేసీఆర్ ప్రకటించారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణి చేస్తామంటూ గతంలో చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు వరి వద్దనడం సిగ్గుచేటని అన్నారు. ఇతర రాష్ట్రాలలో వరి వినియోగం లేదని కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకోకపోవడం సరికాదని అన్నారు. రైతుల సంక్షేమం వినియోగదారులకు లాభం చేకూరే కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వరి వేయడంలో ధాన్యం కొనుగోలు చెయ్యడంలో ఇబ్బందుల్లో పెట్టేస్తున్నారని అన్నారు. దాన్యం ప్రతి గింజ కొంటామంటూనే అన్నదాతలను ఆగమాగం చేసి సంక్షోభంలో నెట్టేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తరుగు పేరుతో మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము, రైతుల ఉసురు తీసుకోకండి. రైతులను ఇబ్బంది పెడితే రైతులకు మద్దతుగా రాష్ట్రం లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంపై చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకురాలు నాయకులు జుకి బాయి, నాగు నాయక్, శాంతి భాయి. సరిత బాయి, దేవా నాయక్ , నాన్క్యా, తదితరులు పాల్గొన్నారు
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments