రిపబ్లిక్ హిందుస్థాన్, పెద్దపల్లి :
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వలనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. సామాన్య ప్రజానీకం ఈ ప్రభుత్వాల పాలనలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ అన్నారు.
ప్రజల మీద ఈ ప్రభుత్వాలు కక్ష పూరితమైన చర్యలకు పాల్పడుతు పేదల రక్తం తాగుతున్నయని అన్నారు.

కేంద్రం యాసంగిలో వరి వేయొద్దు మేము కొనడం జరగదు అని స్పష్టంగా చెప్పిందనీ కేసిర్ అతని సహచరమంత్రులు మీ ఎమ్మెల్యేలు,ఎంపీలు అందరూ వరి వేయొద్దు పంట మార్పిడి అని కేంద్రం చెప్పిందే కేసిర్ చెప్తూన్నడని ఢీల్లీలో కేంద్రం చెప్పిందే రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్నాడు అని అన్నారు. అక్కడ వారు ధాన్యం వద్దు అంటే ఇక్కడ ఈయన వద్దు అంటున్నాడనీ అన్నారు. ఈరోజు చేసిన టీఆర్ఎస్ నాయకుల నిరసనలు హాస్యాస్పదమని దోంగే దొంగ అన్నట్లుగా వీరి చర్యలు ఉన్నయని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేశామని , అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చివరకు సీఎం దృష్టికి తీసుకెళ్లామని అయినా ఫలితం లేదనీ అన్నారు . ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఐకెపి కేంద్రాలను నిర్వహించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనీ ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబందించి అత్యధిక విద్యార్థులు ఉతిర్ణత కాకపోవడం బాధాకరమని ఈ ఘటన చరిత్రలో మొదటిసారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో మానసిక ఒత్తిడి గురయ్యారని సెల్ ఫోన్లు కొనుక్కోని పేద కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులు కష్టపడి ఆన్లైన్ క్లాసుల కోసం సెల్ ఫోన్లు కొనిచ్చిన పలితం లేకుండా పోయిందని అన్నారు.
కేవలం ప్రభుత్వ కళాశాలలకు సంబందించిన విద్యార్థులు అనేక మంది ఫెయిల్ అయ్యారని కార్పోరేట్ కళాశాలల విద్యార్థుల ఉత్తీర్ణత ఎక్కువగా ఉందనీ అన్నారు. వెంటనే విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణ రావు, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య , భూషణ వేణి సురేష్ గౌడ్, ఉట్ల వర ప్రసాద్, పేర్క శ్యామ్, నుగిళ్ల మల్లయ్య, తూముల సుభాష్, భూతగడ్డ సంపత్ , నల్లగొండ కుమార్ పుదరి, చంద్ర శేఖర్ విజయ్ కుమార్, వేముల రాజు, సమాధానం పేర్క సంతోష్ తదితరులు పాల్గోన్నారు
Recent Comments