వికారాబాద్ జిల్లా జనవరి10
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ఓ కారును తప్పించబోయి అదుపుతప్పిన సిమెంట్ లారీ బీభత్సం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే బుధ వారం ఉదయం తాండూర్ నుండి సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఫ్లై ఓవర్ సమీపంలోని పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్తున్న కారును అతి వేగంగా వెళుతున్న లారీ కారును ఢీకొట్టబోయింది.
దగ్గరకు చేరుకున్న లారీ డ్రైవర్ కారును తప్పించే ప్రయత్నంలో భాగంగా లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి ఆపై బిల్డింగ్ ముందుకు దూసుకుపోయింది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయా లయ్యాయి. అతడిని తాండూర్ లోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే లారీ బిల్డింగ్ పైకి దూసుకొచ్చిన సమయంలో పలు ద్విచక్ర వాహనాలు కూడా ఘటన నుండి తప్పించుకున్నాయి. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.
Recent Comments